ePaper
More
    HomeతెలంగాణElectric Buses | 10,300 ఎలక్ట్రిక్​ బస్సుల కోసం కేంద్రం టెండర్

    Electric Buses | 10,300 ఎలక్ట్రిక్​ బస్సుల కోసం కేంద్రం టెండర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Electric Buses | ప్రస్తుతం మెట్రో నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ప్రభుత్వం పదేళ్లు దాటిన డీజిల్​, 15 ఏళ్లు దాటిన పెట్రోల్​ వాహనాలకు ఇంధనం పోయొద్దని ఆదేశించింది. తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో డీజిల్​ వాహనాలను హైదరాబాద్​ నగరం బయటకు పంపిస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల తెలిపారు. నగరంలో మూడు వేల ఎలక్ట్రిక్​ బస్సులను (Electric Buses) నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central government) భారీగా ఎలక్ట్రిక్​ బస్సుల కొనుగోలు కోసం టెండర్​ పిలిచింది.

    ఎలక్ట్రిక్​ బస్సులు, వాహనాలతో కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్​ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు దేశంలో ఎలక్ట్రిక్​ బైక్​లు, కార్ల (electric bikes and cars) విక్రయాలు భారీగా పెరిగాయి. అయితే ప్రభుత్వ రంగ ట్రాన్స్​పోర్టు కోసం కేంద్రం తాజాగా ఎలక్ట్రిక్​ బస్సుల కోసం టెండర్​ ఆహ్వానించింది. మొత్తం 10,900 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ వేసింది. ఇందులో బెంగళూరుకు 4500 బస్సులు, ఢిల్లీకి 2800, హైదరాబాద్​కు 2000, అహ్మదాబాద్​కు 1000, సురాత్ కు 800 బస్సులను కేటాయించనున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...