అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరదనీరు వచ్చి చేరే అవకాశముందని ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. వరద గేట్లకు (Flood gates) కొనసాగుతున్న ఆయిల్ గ్రీసింగ్ పనులను పరిశీలించారు. వరదనీరు వచ్చి చేరితే, నీటిని దిగువకు వదిలేందుకు గేట్లను సిద్ధంగా ఉంచాలని ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ సోలోమాన్, ఏఈలు శివ, అక్షయ్, సాకేత్, ఇరిగేషన్ సిబ్బంది ఉన్నారు.
