అక్షరటుడే, వెబ్‌డెస్క్: ED Raids | హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఈడీ దాడులు (ED raids) దాడులు నిర్వహిస్తున్నారు. రాజేంద్ర నగర్, చైతన్య నగర్‌లోని శివ బాలకృష్ణ (Shiv Balakrishna), ఆయన సోదరుడు నవీన్ కుమార్ ఇళ్లలో సోదాలు చేశారు. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు, లే అవుట్లకు అనుమతి మంజూరుకు రిలయల్టర్లతో కలిసి శివ బాలకృష్ణ క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ఇప్పటికే శివల బాలకృష్ణను అరెస్టు చేసింది. ఇదే కేసులో గతంలో ఆయన సోదరుడు నవీన్ కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకుంది. అయితే గతేడాది జనవరిలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
ED Raids | గతేడాది సీబీఐ కేసు నమోదు
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నారన్న ఆరోపణలపై గతేడాది శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతేడాది జనవరి 25న ఈ కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.