ePaper
More
    HomeతెలంగాణCP Sai Chaitanya | పోలీసులు పనితీరును మెరుగుపర్చుకోవాలి

    CP Sai Chaitanya | పోలీసులు పనితీరును మెరుగుపర్చుకోవాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: CP Sai Chaitanya | మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు తమ పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలో (CP Office) జోన్​–2 బాసర లెవల్​ పోలీస్​ డ్యూటీ మీట్​–2025ను (Police Duty Meet) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సైన్స్​ను ఇన్వెస్టిగేషన్​ టూల్స్​గా మార్చుకునేందుకు పోలీసులు తమను తాము మెరుగుపర్చుకోవాలని సూచించారు. పోలీస్​ డ్యూటీ మీట్​ నిర్వహించడం ద్వారా పనిలో పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఇన్వెస్టిగేషన్​ స్థాయిలు పెరుగుతాయని పేర్కొన్నారు.

    CP Sai Chaitanya | మూడురోజుల పాటు పోటీలు..

    పోలీస్ డ్యూటీ మీట్-2025లో నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ పోలీసు అధికారులకు సిబ్బందికి పోటీలు నిర్వహించారు. సైంటిఫిక్, ఫింగర్ ప్రింట్(Finger print), ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ (Forensic Investigation)​, కంప్యూటర్స్​, డాగ్​ స్క్వాడ్స్(Dog squads)​, ప్రొఫెషనల్​ ఫొటోగ్రఫీ, ఎక్స్​ప్లోజివ్వ్​, నార్కోటిక్​, ఫోరెన్సిక్​ మెడిసిన్​ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు.

    ఈ ఎంపికలు మూడు రోజులపాటు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన వారికి రాష్ట్రస్థాయిలో జరిగే డ్యూటీ మీట్​కు పంపుతామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్​) బస్వారెడ్డి(DCP (Admin) Baswareddy), అదనపు డీసీపీ (ఏఆర్​) రామ్ చందర్ రావు, సీసీఎస్​ ఏసీపీ నాగవేంద్ర చారి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

    పోలీస్​ డ్యూటీ మీట్​లో పాల్గొన్న అధికారులు

    More like this

    Prithvi Shaw | పృథ్వీ షాకు కోర్టు జరిమానా: కోర్టు నోటీసులను పట్టనందుకు రూ.100 జరిమానా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు....

    Pochampad Village | ‘సెంట్రల్‌’ వెలుగులెప్పుడో..!.. అంధకారంలో పోచంపాడ్‌ మార్గం

    అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతోపాటు ఇతర...

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...