అక్షరటుడే, బాన్సువాడ: Banswada | కల్లు లైసెన్స్ ఇవ్వడంలో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కల్లు గీత కార్మికుడు విఠల్ గౌడ్ ఆరోపించారు. మండలంలోని మొగులాన్ పల్లి గ్రామంలో (Mogulan Pally) బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పొలంలో పదేళ్ల క్రితం 1200 ఈత మొక్కలు నాటానని, ప్రస్తుతం ఈతకు వచ్చాయని అన్నారు. హరితహారంలో భాగంగా 2015లో అధికారులు 500 ఈత మొక్కలు ఇచ్చారని, 2009లో 700 ఈత మొక్కలు నాటానని వివరించారు. గ్రామంలో ఒకే ఒక్క గౌడ కుటుంబం ఉందని, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకున్నప్పటికీ అబ్కారీ సీఐ (Excise Department) ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
Banswada | ఎంతోమంది అనర్హులకు లైసెన్స్..
చెట్టు ఎక్కరాని వారికి సైతం ఎక్సైజ్ సిబ్బంది లైసెన్సులు ఇచ్చారని.. అన్నీఉన్న తనకు లైసెన్స్ ఇవ్వడంలో ఇబ్బందులుకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనకు లైసెన్స్ ఇస్తే స్వచ్ఛమైన నీరా మాత్రమే విక్రయిస్తానని ఆయన వివరించారు. సమావేశంలో హరిదాస్, విఠల్ సింగ్, రాజ మహారాజ్, సవాయి సింగ్, శంకర్ పాల్గొన్నారు.