ePaper
More
    HomeతెలంగాణPashamylaram | మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. పేలుడు ఘటనపై స్పందించిన సిగాచి కంపెనీ

    Pashamylaram | మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. పేలుడు ఘటనపై స్పందించిన సిగాచి కంపెనీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పేలుడు ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. సిగాచి పరిశ్రమ(Cigachi Industry)లో రియాక్టర్​ పేలడంతో 40 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

    కొంతమంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రియాక్టర్​ పేలుడుపై సిగాచి కంపెనీ స్పందించింది. పాశమైలారం(Pashamylaram) రియాక్టర్​ పేలుడు ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం ఫ్యాక్టరీని సందర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.లక్ష చొప్పున పరిహారం అందజేశారు. ఫ్యాక్టరీతో మాట్లాడి రూ.కోటి పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా సిగాచి పరిశ్రమ యాజమాన్యం స్పందించింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారని తెలిపింది. 33 మందికి గాయాలైనట్టు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

    పరిశ్రమ నుంచి రూ.కోటి పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లు చెల్లిస్తామని పేర్కొంది. క్షతగాత్రులకు పూర్తి వైద్యసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాచి కంపెనీ సెక్రెటరీ వివేక్‌కుమార్‌(Secretary Vivek Kumar) తెలిపారు.

    Pashamylaram | మూడు నెలల పాటు మూసివేత

    ప్రమాదంతో కంపెనీలో కార్యకలాపాలు మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు వివేక్​కుమార్​ తెలిపారు. ఈ ఘటనపై స్టాక్‌మార్కెట్‌కు సైతం కంపెనీ లేఖ రాసింది. అయితే ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందన్నారు. దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నట్లు పేర్కొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...