అక్షరటుడే, వెబ్డెస్క్ :IPS Siddharth Kaushal | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా పని చేస్తున్న ఆయన వీఆర్ఎస్(VRS) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆయన నెల రోజులుగా విధులకు రావడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ(IPS officers Transfer) చేసిన విషయం తెలిసిందే. పలువురు అధికారులకు పోస్టింగ్లు సైతం ఇవ్వలేదు. గతంలో వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారిని అప్రాధాన్య పోస్టులకు పంపించింది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ కౌశల్(IPS officer Siddharth Kaushal) వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.