ePaper
More
    HomeతెలంగాణPashamylaram | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    Pashamylaram | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​(PCC Chief Mahesh Goud) అన్నారు. బుధవారం ఉదయం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్​ పేలుడు(Reactor Explosion) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

    Pashamylaram | 13 మంది ఆచూకీ గల్లంతు

    రియాక్టర్​ పేలుడు దాటికి పలు భవనాలు కూలిపోయాయి. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు కంపెనీలోని 13 మంది ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో శిథిలాల కింద వారు చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    Pashamylaram | పరిశీలించిన మీనాక్షి నటరాజన్​

    కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​(Meenakshi Natarajan) మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఫ్యాక్టరీని పరిశీలించి మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ ఫ్యాక్టరీని పరిశీలించారు. సీఎం రేవంత్​ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఈ ఘటనపై రాహుల్​ గాంధీ(Rahul Gandhi) విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

    Pashamylaram | కంపెనీ యాజమాన్యంపై కేసు

    పాశమైలారం(Pashamylaram) సిగాచి కంపెనీలో రియాక్టర్​ పేలుడుకు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బాధితుల రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. మరోవైపు పరిహారం విషయంలో కూడా కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

    More like this

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...