ePaper
More
    HomeజాతీయంYamini Sharma | బీజేపీ జాతీయ కౌన్సిల్​ మెంబర్​గా యామినిశర్మ

    Yamini Sharma | బీజేపీ జాతీయ కౌన్సిల్​ మెంబర్​గా యామినిశర్మ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yamini Sharma | బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినిశర్శ (Sadineni Yamini Sharma) జాతీయ కౌన్సిల్​ సభ్యురాలిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ కమల దళాధిపతిగా రాంచందర్​రావు(Ramchandra Rao), ఏపీకి అధ్యక్షుడిగా పీవీఎన్​ మాధవ్(AP President PVN Madhav)​ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో జాతీయ కౌన్సిల్​ సభ్యులను కూడా బీజేపీ ప్రకటించింది. ఇందులో సాదినేని యామిని శర్మకు సైతం చోటు దక్కింది.

    యామిని శర్మ మాట్లాడుతూ.. మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పార్టీ కార్యకర్తలకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. పార్టీ తన సేవలను గుర్తించి, జాతీయ మండలి సభ్యురాలిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కాగా ఆమెతో పాటు ఎంపీలు డి.పురందేశ్వరి, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పి.విష్ణు కుమార్ రాజు, పార్థసారథి, 20-పాయింట్ ప్రోగ్రామ్ ఛైర్మన్ లంకా దినకర్, జీవీఏ నరసింహారావు, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు జాతీయ మండలి సభ్యులుగా నియమితులయ్యారు.

    Yamini Sharma | టీడీపీ నుంచి..

    యామినిశర్శ టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మంచి వాగ్దాటి కలిగిన ఆమె అంచెంలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. 2023లో టీడీపీకి రాజీనామా చేసిన ఆమె 2024లో కాషాయ గూటికి చేరారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఆమెను కేంద్ర నాయకత్వం తాజాగా జాతీయ కౌన్సిల్​ మెంబర్(National Council Member)​గా నియమించింది.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షర టుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని,...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this