ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | పవన్ కళ్యాణ్​కు షాక్​.. తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు

    Pawan Kalyan | పవన్ కళ్యాణ్​కు షాక్​.. తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, అమరావతి : Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy CM Pawan Kalyan)​కు తమిళనాడు Tamil Nadu పోలీసులు షాక్​ ఇచ్చారు. అక్కడి అన్నానగర్ పోలీస్ స్టేషన్‌ లో పవన్ పై కేసు నమోదు చేశారు. గత నెల(జూన్​ 22)లో మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పాల్గొన్న పవన్ ఉద్వేగ పూరిత ప్రసంగంతో​ మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారనే అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) మురుగన్​ భక్తుల సదస్సు(Murugan devotees’ conference)లో ద్వేషపూరిత ప్రసంగం చేశారనేది అభియోగం. దీనిపై అన్నామలై తో పాటు అనేక మంది నిర్వాహకులపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

    Pawan Kalyan : పలు సెక్షన్​ల కింద..

    పవన్​ కళ్యాణ్​పై మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ న్యాయవాది వంజినాథన్ ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. ఈమేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్​పై కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196(1)(ఏ), 299, 302, 353(1)(బి)(2)లను కేసులో తమిళనాడు​ పోలీసులు పొందుపర్చారు.

    మురుగన్​ భక్తుల సదస్సులో చేసిన ప్రసంగాలు, తీర్మానాలు.. జాతి, మతం, ప్రాంత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేవిగా, సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ఐఆర్​లో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

    Pawan Kalyan : పవన్​ కళ్యాణ్​ ప్రసంగాన్ని ఓసారి పరిశీలిస్తే…

    ఈ సదస్సులో హిందువులు ఒక కూటమిగా ఓటు వేయాలని కోరారు. ఆలయాలను ఆదాయ వనరులుగా పరిగణిస్తున్నందుకు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొన్ని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై పవన్ ప్రసంగిస్తూ… హిందువుల్ని నిలదేసే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాల్ని ప్రశ్నించే ధైర్యం ఉందా? అని అన్నారు. మురుగన్‌ భక్తులు ఒక్కచూపు చూస్తే చాలు.. తమ దేవుడిని దూషించే కూటమి కంటికి కనిపించకుండా పోతుందన్నారు. సహజంగా నాస్తికులు భగవంతుడిని నమ్మరని గుర్తుచేశారు. కానీ, కొందరు మాత్రం హిందూ దేవుళ్లనే నమ్మమంటున్నారని వ్యాఖ్యానించారు. హిందూధర్మాన్ని తప్పితే ఇతర వాటిని నిలదీసే ధైర్యం వారికి లేదని పవన్ కళ్యాణ్​ అన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...