ePaper
More
    HomeసినిమాFish Venkat | వెంటిలేటర్‌పై టాలీవుడ్​ నటుడు ఫిష్ వెంకట్.. సాయం కోసం ఎదురుచూపులు

    Fish Venkat | వెంటిలేటర్‌పై టాలీవుడ్​ నటుడు ఫిష్ వెంకట్.. సాయం కోసం ఎదురుచూపులు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్​ : Fish Venkat : ప్రముఖ టాలీవుడ్​ నటుడు(Tollywood actor) ఫిష్​ వెంకట్​ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో నటుడికి వైద్యులు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు.

    కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్​ కొన్ని నెలల క్రితమే చికిత్స ​ చేయించుకున్నారు. తాజాగా మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఎవరినీ గుర్తుపట్టేలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

    ఫిష్ వెంకట్‌ ఫ్యామిలీ ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. తాజాగా ఆయన ఆసుపత్రి పాలు కావడంతో తమను ఆదుకోవాలని వెంకట్ భార్య వేడుకుంటున్నారు. ఎవరైనా దాతలు అండగా నిలవాలని ఆయన భార్యతోపాటు కూతురు దయార్థ హృదయంతో అర్థిస్తున్నారు.

    Fish Venkat : ఇటీవల పవన్​ కల్యాణ్ ఆర్థిక​ సాయం..

    గతంలో చికిత్సకు డబ్బుల్లేక గాంధీ ఆస్పత్రిలో వెంకట్​ వైద్యం చేయించుకున్నారు. అప్పుడు ఆయన పరిస్థితిని తెలుసుకున్న పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Power Star, Andhra Pradesh Deputy CM Pawan Kalyan) రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం మళ్లీ క్షీణించి ఆస్పత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...