అక్షరటుడే, అమరావతి : YS Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో తన పాదయాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YSR Congress Party chief, former CM YS Jagan) కీలక ప్రకటన చేశారు. తాడేపల్లి(Tadepalli)లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు(జులై 1) జరిగిన యువ విభాగ సమావేశంలో తన పాదయాత్రపై స్పష్టత ఇచ్చారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని జగన్ తెలిపారు. తర్వాత పాదయాత్ర ఉంటుందన్నారు.
YS Jagan : పార్టీ పెట్టిన కొత్తలో…
పార్టీ పెట్టిన కొత్తలో అందరూ కొత్తవాళ్లేనని జగన్ గుర్తుచేసుకున్నారు. మొదట తనతో పాటు అమ్మ మాత్రమే ఉన్నట్లు గుర్తుచేశారు. తనపై అభిమానం ఉన్నవాళ్లు పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ప్రస్థానం ఎక్కడ మొదలైందో.. ఎదురైన కష్టాలను ప్రస్తావించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజీ పడలేదన్నారు.
YS Jagan : రాజకీయాల్లో అది అత్యంత ముఖ్యమైనది..
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని జగన్ అన్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగానికి దిశానిర్దేశం చేశారు. యూత్ వింగ్ అనేది పార్టీలో అత్యంత క్రియాశీలకమైనదన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. నాయకులుగా ఎదిగేందుకు ఇది గొప్ప అవకాశమని జగన్ పేర్కొన్నారు.
YS Jagan : ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ
ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ తనకు వచ్చిందని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆ ఫలితాలు ప్రతి పార్లమెంటు సభ్యుడిని మనవైపు చూసేలా చేసిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక కొందరు తమ మీద పగబట్టారన్నారు. 18 మంది శాసనసభ్యులు తమ పార్టీలోకి వస్తే.. వాళ్లందరిచేతా రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా చేశామన్నారు. కానీ, ఆ ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసే పోటీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికష్టాలు వచ్చినా, విశ్వసనీయత, విలువలకు పెద్దపీట వేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు.