- Advertisement -
HomeUncategorizedPrabhas Injury | ఫౌజీ సెట్‌లో ప్ర‌భాస్ కాలికి గాయం.. టెన్ష‌న్ ప‌డుతున్న ఫ్యాన్స్

Prabhas Injury | ఫౌజీ సెట్‌లో ప్ర‌భాస్ కాలికి గాయం.. టెన్ష‌న్ ప‌డుతున్న ఫ్యాన్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Prabhas injury | స‌లార్ (Salaar), ‘కల్కి 2898 ఏ.డి.’ వంటి భారీ విజయాల తర్వాత ప్రభాస్ (Prabhas) తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాజాసాబ్‌’ సినిమాపై (Rajasab Movie) అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ‘స్త్రీ 2’ (Stree 2) భారీ విజయాన్ని సాధించడంతో, అదే జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందన్న నమ్మకం అభిమానుల‌లో ఉంది. ఇక ‘రాజాసాబ్‌’తో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ (Fauji), సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమాలు (Spirit Movie) కూడా ప్రభాస్ లైనప్‌లో ఉన్నాయి.

prabhas injury | మ‌ళ్లీ గాయ‌మా?

స్పిరిట్ సినిమా 2025 ప్రారంభంలో ప్రారంభమై, అదే ఏడాది ద్వితీయార్థంలో పూర్తి చేయాలన్నది మేకర్స్ ప్లాన్. భూషణ్ కుమార్ ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు (officially announced). ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఫౌజీ చిత్ర (Fouji movie) షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ (Movie Shootng) శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్ర‌భాస్ కాలికి ఫ్రాక్చ‌ర్ (Prabhas leg fracture) అయింద‌న్న వార్త అభిమానుల‌ను ఆందోళ‌నకు గురి చేస్తుంది. అయితే చిన్నపాటి ఫ్రాక్చ‌ర్ అయిన కూడా ప్ర‌భాస్ దానిని ఏ మాత్రం లెక్క చేయ‌కుండా షూటింగ్‌లో పాల్గొన్నాడ‌ట‌.

- Advertisement -

గ‌తంలో ప్ర‌భాస్ కాలికి గాయం అవ్వడం కారణంగా కొన్నాళ్ల‌పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇట‌లీలో స‌ర్జ‌రీ (Surgery) చేయించుకొని కొన్నాళ్ల‌పాటు విశ్రాంతి తీసుకున్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌భాస్ కాలికి గాయం అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏ కాలికి అనే దానిపై క్లారిటీ లేదు. వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌భాస్ కాలి గాయానికి సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వండి అని పీఆర్‌టీమ్‌ (PR Team)ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News