అక్షరటుడే, కామారెడ్డి:Swami Brahmananda Saraswati | మానవులు ఎలాంటి కల్మషం లేకుండా జీవించాలని ఆర్ష గురుకుల ఆచార్యులు స్వామి బ్రహ్మానంద సరస్వతి అన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో ఉన్న ఆర్ష గురుకులం స్వర్ణోత్సవ(Golden Jubilee) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులంలో అష్టోత్తర(108) శతకుండీయ మహాయజ్ఞం(Shatakundiya Mahayagnam) నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మానంద సరస్వతి(Swami Brahmananda Saraswati) మాట్లాడుతూ.. మానవులందరూ కలిసి జీవించాలన్నారు. కలిసి జీవించకుంటే దుఃఖాలు ఎదురవుతాయని వివరించారు. మనసులో కల్మషం పెట్టుకుంటే మనుషులు దూరం అవుతారన్నారు. కార్యక్రమంలో కంకణాల కిషన్, మాఘం కృష్ణమూర్తి, ఆష్తోష్ స్వామి, హరికిషన్ వేదాలంకారం, పండిత్ హరిదాస్ ఆర్య, ఆచార్య వేదమిత్ర, భక్తులు పాల్గొన్నారు.