ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDoctor's Day | ఘనంగా వైద్యుల దినోత్సవం

    Doctor’s Day | ఘనంగా వైద్యుల దినోత్సవం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Doctor’s Day | రోటరీ క్లబ్ నిజామాబాద్ (Rotary Club Nizamabad) ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంట్స్​డేను (Charted Accounts Day) ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రముఖ డాక్టర్లు కునాల్ వ్యవహారే, గౌరవ్, మహేష్ లాహోటి, అలాగే చార్టెడ్ అకౌంట్లు ప్రవీణ్, గౌరవ్ జోహార్, ఇంగు ఈశ్వర్, రాందార్, తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నూతన అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, డైరెక్టర్ సర్వీస్ ప్రాజెక్టు రాజ్​కుమార్​ సుబేదార్, శ్రీకాంత్, డాక్టర్ డీజే వ్యవహారే, ఆకుల అశోక్, రాజేశ్వర్, చిలక ప్రకాష్, తులసీదాస్ పటేల్, అశోక్, జగదీశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీరాంసోని, జితేంద్ర మలాని తదితరులు పాల్గొన్నారు.

    Doctor’s Day | లింగంపేటలో..

    అక్షరటుడే, లింగంపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (Primary Health Center) మంగళవారం వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని మండల వైద్యాధికారిణి రాంబాయిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సమాజంలో ఎంతో ఉన్నతమైన వృత్తి వైద్య వృత్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సబ్ యూనిట్ అధికారి గోవింద్ రెడ్డి, సీహెచ్​వో రమేశ్​, ఫరీదా, యాదగిరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

    మండల వైద్యాధికారిణి రాంబాయిని సన్మానిస్తున్న దృశ్యం

    Doctor’s Day | ఆర్మూర్​లో..

    అక్షరటుడే, ఆర్మూర్: ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా ఆర్మూర్ అఖిల పక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని పలువురు వైద్యులను మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​ ​ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి మైలారం బాలు, సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, మాజీ సర్వ సమాజ్ అధ్యక్షులు గుండేటి మహేష్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ నర్మే నవీన్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షడు మీసాల రవి, జన్నేపల్లి రంజిత్, గుంజల పృథ్వీ, తెడ్డు రాజు, మోర్ ఉదయ్, ఉమర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

    ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో పట్టణంలో వైద్యులను సన్మానిస్తున్న నాయకులు

    Doctor’s Day | రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో..

    నగరంలో రెడ్​క్రాస్​ సొసైటీ నిజామాబాద్​ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులకు ఘనసన్మానం

    నగరంలోని రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగానికి సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్​క్రాస్​ సొసైటీ అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ రక్తదాన శిబిరాలు, తలసేమియా రోగుల చికిత్స, ఆరోగ్య శిబిరాల్లో సహకరించిన వైద్యులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వైద్యులు జీవన్ రావు, నాగేశ్వర్ రెడ్డి , కౌలయ్య, రవీంద్రనాథ్ సూరి, విబూది రాజేష్, నీలి రాంచందర్, సవిత రాణి, బొగ్గుల రాజేష్, కొట్టూరు శ్రీశైలం, అశ్విన్ కుమార్ రెడ్డి, జమల్పూర్ రాజశేఖర్​ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు, పోచయ్య , బొద్దుల రామకృష్ణ, బ్లడ్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

    Doctor’s Day | నిజాంసాగర్​లో..

    అక్షరటుడే నిజాంసాగర్: మండల కేంద్రంలో మంగళవారం డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల వైద్యాధికారి రోహిత్ కుమార్​తో పాటు డాక్టర్ రత్నంను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

    చిన్నపిల్లల వైద్యుడు సురేష్​ జాజును సన్మానిస్తున్న మెడికవర్​ ఆస్పత్రి వైద్యబృందం

    సర్జన్​ అవిన్ సనార్ వాస్కులర్​ను సన్మానిస్తున్న మెడికవర్​ ఆస్పత్రి వైద్యబృందం

    More like this

    Stock Markets | ఐటీలో కొనసాగిన జోరు.. లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌(Trade deal) వైపు అడుగులు...

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...