ePaper
More
    Homeఅంతర్జాతీయంDonald Trump | ట్రంప్, మ‌స్క్ మ‌ధ్య మ‌ళ్లీ లొల్లి.. అవి ఆపేస్తే టెస్లా అధినేత...

    Donald Trump | ట్రంప్, మ‌స్క్ మ‌ధ్య మ‌ళ్లీ లొల్లి.. అవి ఆపేస్తే టెస్లా అధినేత దుకాణం స‌ర్దేసుకుంటాడన్న అమెరికా అధ్యక్షుడు..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మ‌స్క్(Elon Musk) మ‌ధ్య మొద‌లైన వివాదం మ‌రింత ముదిరింది. అమెరికా చ‌ట్ట స‌భ‌లు బిగ్ వ‌న్ బ్యూటీఫుల్ బిల్లును ఆమోదిస్తే తానే కొత్త పార్టీని పెడ‌తాన‌ని మ‌స్క్ ప్ర‌క‌టించ‌డం, దీనికి ట్రంప్ దీటుగా కౌంట‌ర్ ఇవ్వ‌డం.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టెస్లా అధినేత మ‌స్క్‌.. మానవ చ‌రిత్ర‌లో ఎవ‌రూ పొంద‌నన్ని రాయితీలు పొందార‌ని ట్రంప్ విమ‌ర్శించారు. అమెరికా ప్రభుత్వ మద్దతు లేకుండా ఆయ‌న మ‌నుగ‌డ కొనసాగించ‌లేరిన స్ప‌ష్టం చేశారు. అలాగే చేస్తే దుకాణం స‌ర్దేసుకుని త‌న సొంత దేశం దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేర‌కు త‌న‌ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. “ఎలాన్ మస్క్ నన్ను అధ్యక్షుడిగా బ‌లంగా మ‌ద్ద‌తిచ్చారు. అయితే అప్ప‌టికే నేను ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ త‌ప్ప‌నిస‌రి చేయ‌డాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆయనకు తెలుసు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎల్లప్పుడూ నా ప్రచారంలో ప్రధాన భాగం. ఎలక్ట్రిక్ కార్లు బాగున్నాయి, కానీ ప్రతి ఒక్కరూ స్వంతం చేసుకోవాలని బలవంతం చేయలేమ‌ని.”

    Donald Trump | ట్రంప్ స్ప‌ష్టం చేశారు.

    ఇక రాకెట్ ప్ర‌యోగాలు, ఈవీలు ఉండ‌వు చరిత్రలో మస్క్ పొందిన‌న్ని ప్ర‌భుత్వ స‌బ్సిడీలు ఎవ‌రూ పొంద‌లేద‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు. మ‌స్క్‌కు ఇస్తున్న స‌బ్సిడీల‌ను ఆపేస్తే ఆయ‌న దుకాణం స‌ర్దేసుకుని సొంత దేశం ద‌క్షిణాఫ్రికా(South Africa)కు వెళ్లాల్సిందేనన్నారు. “చరిత్రలో ఇప్పటివరకు ఎవ‌రూ పొంద‌న‌ని స‌బ్సిడీలు మ‌స్క్ పొందారు. అయితే, ఆ సబ్సిడీలు లేక‌పోతే అత‌డు దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇకపై రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు. మన దేశం అదృష్టాన్ని ఆదా చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

    Donald Trump | ఆ నిధులపై దర్యాప్తు చేయాలి

    మస్క్ కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీల ప్రవాహంపై దర్యాప్తు చేయాలనే ఆలోచనను కూడా ట్రంప్ తెర పైకి తీసుకొచ్చారు. “బహుశా మనం దీని(స‌బ్సిడీల‌)పై బాగా ఆలోచించాలి. దీనిపై డోచ్‌తో విచార‌ణ జ‌రిపించాలి. ఇది చాలా ముఖ్య‌మైన‌ది. దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇలా చేస్తే అమెరికా(America)కు భారీగా డ‌బ్బు ఆదా అవుతుంద‌ని” అని పేర్కొన్నారు.

    Donald Trump | పార్టీ పెడ‌తాన‌న్న మ‌స్క్‌..

    వైట్ హౌస్(White House) భారీ పన్ను, ఇమ్మిగ్రేషన్ ఎజెండాపై సెనేట్ లో ఓటింగ్ జ‌రుగుతున్న క్ర‌మంలో దీనిపై ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌స్క్ స్పందిస్తూ “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” ను తీవ్రంగా వ్య‌తిరేకించాడు. బిల్లుకు మద్దతు ఇచ్చే చట్టసభ సభ్యులు రాజకీయ పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించాడు. బిల్లును ఆమోదిస్తూ తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్ర‌కటించాడు. ఈ మేర‌కు “X” లో వ‌రుస‌గా పోస్టులు చేశాడు. బ్యూటీఫుల్‌ బిల్లుకు మద్దతు ఇచ్చిన చట్టసభ సభ్యులను మస్క్ లక్ష్యంగా చేసుకున్నాడు. “ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంపై ప్రచారం చేసి, వెంటనే చరిత్రలో అతిపెద్ద రుణ పెరుగుదలకు ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తల వంచుకోవాలి” అని ఆయన అన్నారు. బిల్లు ఆమోదం పొందితే,తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. “ఈ పిచ్చి ఖర్చు బిల్లు ఆమోదం పొందితే, మరుసటి రోజు అమెరికా పార్టీ ఏర్పడుతుంది. మన దేశానికి డెమొక్రాట్-రిపబ్లికన్ యూనిపార్టీకి ప్రత్యామ్నాయం అవసరం, తద్వారా ప్రజలకు నిజంగా వాయిస్ ఉంటుంది” అని మస్క్ పోస్ట్ చేశారు.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...