ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిEAPSET | ఈఏపీసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

    EAPSET | ఈఏపీసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: EAPSET | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) ఈఏపీసెట్ (ఎంసెట్) (EAMCET) మొదటిదశ ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం వరకు కొనసాగుతుందన్నారు. కామారెడ్డి (kamareddy) చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని కోరారు. ఈ పరిశీలనకు 823 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని తెలిపారు.

    EAPSET | భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదగాలి..

    ఎంట్రెన్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు, విద్యనేర్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు ధ్రువపత్రాల కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తూ ఈనెల 6 నుండి 10వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాల కోసం ఆప్షన్ ఇవ్వాలని, 18న మొదటి విడత సీట్ అలాట్​మెంట్​ జరుగుతుందని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనలో అకడమిక్ కో–ఆర్డినేటర్ విశ్వప్రసాద్, వెరిఫికేషన్ ఆఫీసర్స్ అజహరొద్దీన్​, ఫర్హీన్ ఫాతిమా, ఆఫ్రీన్ ఫాతిమా, ఆరె శ్రీలత, పవన్ కుమార్, సిబ్బంది కనకరాజు, నాగరాజు పాల్గొన్నారు.

    విద్యార్థులకు కన్ఫర్మేషన్ లెటర్ అందజేస్తున్న ప్రిన్సిపాల్​ విజయ్​కుమార్​

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...