అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Domakonda | దోమకొండ ఆర్యవైశ్య సంఘం(Arya Vaishya Sangam) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయం(Kanyakaparameshwari Temple)లో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా కొడిప్యాక మనోహర్, గౌరవాధ్యక్షుడిగా చెన్నం నారాయణ, గౌరవ కార్యదర్శిగా లింగ సిద్ధరాములు, కార్యదర్శిగా పాత వెంకయ్య, ఉపాధ్యక్షుడిగా పారిపల్లి సురేష్, కోశాధికారిగా చింతల వెంకన్న, కార్యవర్గ సభ్యులుగా ఎర్ర నరేందర్, లింగ నాగభూషణం, లింగ శ్రీధర్, కొడిప్యాక సురేష్, తాటిపల్లి సత్తయ్య, చెన్నం సంతోష్, చెన్నం శేఖర్, రేఖ కృష్ణమూర్తి, కన్నా ప్రశాంత్, కస్పా ప్రశాంత్, ముక్క శ్రీనివాస్, కొండూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.