Stock Market
Stock Market | ఒడిదుడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ(Nikkei) మినహా మిగిలిన ప్రధాన మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. యూఎస్‌కు చెందిన డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 79 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా మరో 189 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 277 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 34 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 42 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 80 పాయింట్లు నష్టపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌, నిఫ్టీ ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో లాభాల స్వీకరణ(Profit booking) జరుగుతోంది. మెటల్‌, మీడియా రంగాల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. నిఫ్టీలో అపోలో హాస్పిటల్స్‌, రిలయన్స్‌ టాప్‌ గెయినర్లుగా నిలవగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే టాప్‌ లాసర్లుగా ఉన్నాయి.

Stock Market | మిక్స్‌డ్‌గా అన్నిరంగాల షేర్లు

బీఎస్‌ఈ(BSE)లో రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. రియాలిటీ(Realty) ఇండెక్స్‌ 0.63 శాతం పడిపోగా.. పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 0.61 శాతం నష్టంతో ఉంది. మెటల్‌ 0.56 శాతం, హెల్త్‌కేర్‌ 0.45 శాతం, ఇన్‌ఫ్రా 0.37 శాతం, బ్యాంకెక్స్‌ 0.34 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.42 శాతం, ఎనర్జీ ఇండెక్స్‌ 0.26 శాతం లాభాలతో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌(Mid cap) ఇండెక్స్‌ 0.38 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.30 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.02 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.

Top gainers:బీఎస్‌ఈలో 13 కంపెనీలు లాభాలతో 17 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. బీఈఎల్‌ 2.49 శాతం, రిలయన్స్‌ 1.28 శాతం, ఆసియా పెయింట్స్‌ 0.97 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.73 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 0.55 శాతం లాభాలతో ఉన్నాయి.

Top losers:యాక్సిస్‌ బ్యాంక్‌ 2.50 శాతం, ట్రెంట్‌ 1.18 శాతం, టెక్‌మహీంద్రా 0.86 శాతం, ఎటర్నల్‌ 0.85 శాతం, సన్‌ఫార్మా 0.84 శాతం నష్టాలతో ఉన్నాయి.