ePaper
More
    Homeబిజినెస్​IPO's Listing | మెయిన్‌ బోర్డ్‌లో లాభాలపంట.. నిరాశ పరిచిన ఎస్‌ఎంఈ ఐపీవోలు

    IPO’s Listing | మెయిన్‌ బోర్డ్‌లో లాభాలపంట.. నిరాశ పరిచిన ఎస్‌ఎంఈ ఐపీవోలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO’s Listing | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం ఏడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో మూడు మెయిన్‌ బోర్డు(Main board) ఐపీవోలు కాగా.. మరో నాలుగు ఎస్‌ఎంఈ(SME) ఐపీవోలు. మెయిన్‌ బోర్డు ఐపీవోలు ఇన్వెస్టర్లకు లాభాలపంట పండించగా.. ఎస్‌ఎంఈ ఐపీవోలు నష్టాలను మిగిల్చాయి.

    మెయిన్‌ బోర్డ్‌ ఐపీవోలు: కల్పతరు, గ్లోబల్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌, ఎలెన్‌బారీ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌(Ellenbarrie Industrial Gases). ఇవి ఎస్‌ఎస్‌ఈతోపాటు బీఎస్‌ఈలోనూ లిస్టయ్యాయి.

    ఎస్‌ఎంఈ ఐపీవోలు : శ్రీహరికృష్ణ స్పాంజ్‌ ఐరన్‌(Shri Hare Krishna Sponge Iron), ఐకాన్‌ ఫెసిలిటేటర్స్‌, అబ్రం ఫుడ్‌, ఏజేసీ జెవెల్‌. శ్రీహరికృష్ణ స్పాంజ్‌ ఐరన్‌ ఎస్‌ఎంఈ కంపెనీ ఎన్‌ఎస్‌ఈలో లిస్టవగా.. మిగిలిన మూడు కంపెనీలు బీఎస్‌ఈలో లిస్టయ్యాయి.

    IPO’s Listing | ఎలెన్‌బారీ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌

    ఎలెన్‌బారీ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ కంపెనీ రూ. 452.5 కోట్లు సమీకరించడం కోసం ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చింది. ఐపీవో(IPO)లో రూ.400లకు విక్రయించగా.. 21.5 శాతం ప్రీమియం(Premium)తో రూ. 486 వద్ద లిస్టయ్యాయి. రూ.534కు చేరి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంటే తొలిరోజే 33.65 శాతం లాభాలను అందించింది.

    IPO’s Listing | గ్లోబల్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్

    ఐపీవో ద్వారా గ్లోబల్‌ సివిల్‌ ప్రాజెక్ట్స్‌(Globe civil projects) కంపెనీ రూ. 119 కోట్లు సమీకరించింది. ఇష్యూ ప్రైస్‌ రూ.71 కాగా.. రూ.90 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ. 87కి తగ్గినా.. తిరిగి పుంజుకుని రూ. 94 వద్ద కొనసాగుతోంది. లిస్టింగ్‌ సమయంలోనే 26.76 శాతం లాభాలను అందించింది.

    IPO’s Listing | కల్పతరు..

    కల్పతరు(Kalpataru) కంపెనీ రూ. 1,590 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఒక్కో ఈక్విటీ షేరును రూ. 414కు విక్రయించగా.. ఇదే ధర వద్ద లిస్టయ్యింది. అక్కడినుంచి రూ. 38 పెరిగి రూ. 452 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

    IPO’s Listing | శ్రీహరికృష్ణ స్పాంజ్‌ ఐరన్‌ ఎస్‌ఎంఈ కంపెనీ..

    రూ. 28.39 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో వచ్చిన శ్రీహరికృష్ణ స్పాంజ్‌ ఐరన్‌ ఎస్‌ఎంఈ కంపెనీ మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యింది. ఇష్యూ ప్రైస్‌ రూ. 59 కాగా.. రూ. 64.80 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 61.60కు పడిపోయి ఆ తర్వాత రూ. 65.75 కు పెరిగింది. 9.83 శాతం ప్రీమియంతో ఈ కంపెనీ లిస్టయ్యింది.

    IPO’s Listing | ఏజేసీ జెవెల్‌ ఎస్‌ఎంఈ కంపెనీ..

    ఏజేసీ జెవెల్‌(AJC jewel) బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ కంపెనీ రూ. 14.59 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్ల ఇష్యూ ప్రైస్‌ రూ. 95 కాగా.. 4.21 శాతం ప్రీమియంతో రూ. 99 వద్ద లిస్టయ్యింది. అయితే వెంటనే అక్కడినుంచి ఐదు శాతం పడిపోయి రూ. 94.05 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది.

    IPO’s Listing | అబ్రం ఫుడ్‌ ఎస్‌ఎంఈ కంపెనీ..

    అబ్రం ఫుడ్‌(Abram food) ఎస్‌ఎంఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 13.29 కోట్లు సమీకరించింది. ఇష్యూ ప్రైస్‌ రూ. 98 కాగా.. 7.70 శాతం డిస్కౌంట్‌తో రూ. 90.40 వద్ద బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఆ తర్వాత ఇంట్రాడేలో రూ. 86.01 కి పడిపోయినా.. కోలుకుని రూ. 94 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

    IPO’s Listing | ఐకాన్‌ ఫెసిలిటేటర్స్‌ ఎస్‌ఎంఈ కంపెనీ..

    ఐకాన్‌ ఫెసిలిటేటర్స్‌(Icon Facilitators) ఎస్‌ఎంఈ కంపెనీ రూ. 18.15 కోట్లు సమీకరించడం కోసం ఐపీవోకు వచ్చింది. ఐపీవో ప్రైస్‌ రూ. 91 కాగా.. 1.1 శాతం డిస్కౌంట్‌లో రూ. 90 వద్ద బీఎస్‌ఈలో లిస్టయ్యింది. అనంతరం రూ. 85.50కి తగ్గి లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినవారికి తొలిరోజే 6 శాతానికిపైగా నష్టాలు వచ్చాయి.

    More like this

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్ ను విమర్శించిన బీజేపీ నేత

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి...