ePaper
More
    HomeతెలంగాణMLA Raja Singh | వాళ్లు పార్టీని నాశనం చేస్తున్నారు.. రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

    MLA Raja Singh | వాళ్లు పార్టీని నాశనం చేస్తున్నారు.. రాజాసింగ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:MLA Raja Singh | రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్​(MLA Rajasingh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్​ రావు(Ramachandra Rao) ఎన్నిక కావడంతో రాజాసింగ్​ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తన రాజీనామా పత్రాన్ని కిషన్​ రెడ్డికి అందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ(Telangana BJP)లోని కొందరు పెద్దవాళ్లు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ తమకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇది చూసి సహించే శక్తి లేకే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తాను హిందూ నేతను.. ధర్మ ప్రచారమే తన పని ఆయన పేర్కొన్నారు.

    MLA Raja Singh | గతంలో సైతం ఆరోపణలు

    రాజాసింగ్​ కార్పొరేటర్​గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ నుంచి కార్పొరేటర్​గా గెలిచిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018, 2023 ఎన్నికల్లో సైతం గెలుపొంది హ్యాట్రిక్​ సాధించారు.అయితే 2023 ఎన్నికల తర్వాత ఆయన పార్టీలోని కొందరు నాయకులపై విమర్శలు చేయడం ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తి సీఎంలతో రహస్య సమావేశాలు అవుతారన్నారు. అంతేగాకుండా తనను జైలులో పెట్టడానికి కొందరు పార్టీ నాయకులు నాడు కేసీఆర్​కు సహకారం అందించారన్నారు. రాష్ట్ర నాయకత్వం సూచించిన వారికి కాకుండా హైకమాండ్(High Command)​ సమర్థుడైన వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. తాజాగా రాంచందర్ ​రావుకు పదవి అప్పగించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

    MLA Raja Singh | బీజేపీ కీలక ప్రకటన

    రాజాసింగ్‌ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని బీజేపీ(BJP) పేర్కొంది. కిషన్ రెడ్డి(Kisan Reddy)కి సమర్పించిన రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షుడికి పంపిస్తామని రాష్ట్ర పార్టీ నాయకత్వం పేర్కొంది. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే, రాజీనామా లేఖ(Resignation Letter)ను స్పీకర్‌కు సమర్పించాలని సూచించింది. గతంలో కూడా ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య వ్యవహారాలతో సస్పెండ్ అయితే మళ్లీ పార్టీలోకి తీసుకున్నామని పేర్కొంది. పార్టీ క్రమశిక్షణను రాజాసింగ్ పలుమార్లు ఉల్లంఘించారని ఒక ప్రకటనలో పేర్కొంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. ఏ మార్గంలోనంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...