
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Flipkart GOAT Sale | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్(Flipkart) ప్రత్యేక సేల్స్ హంగామాకు సిద్ధమవుతోంది. ఈనెల 12 నుంచి 17 వ తేదీ వరకు గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ(VIP) సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే 11వ తేదీనే సేల్ అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్లు ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ ఏటా ఒక సారి గోట్(GOAT) సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లు(Smart phones), ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీ, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఫర్నిచర్, గ్రోసరి తదితర ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరపై అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. కెమెరాలు, స్పీకర్లు, పాదరక్షలు, మ్యాట్రిసెస్ తదితర వాటిపైనా ప్రత్యేక ఆఫర్లు అందించనుంది. బీవోజీవో(బై వన్ గెట్ వన్) ఆఫర్లు, కాంబో డీల్స్(Combo deals), ఫ్లాష్ సేల్స్ ఉండనున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌లపై ప్రత్యేకమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐతో శాంసంగ్(Samsung), ఆపిల్, రియల్‌మీ, రెడ్‌మీ వంటి బ్రాండ్లపై భారీ తగ్గింపు ధరలు వర్తించనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్ టీవీలపై అదనపు వారంటీ ఆఫర్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఫ్యాషన్ బొనాంజా, మెగా క్లియరెన్స్ డిస్కౌంట్లు ఉండనున్నాయి. బ్యూటీ, వెల్నెస్, ఫ్యాషన్ వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపు(Discount) ఇవ్వనున్నారు.
కంపెనీ కార్డు ఆఫర్లను ఇంకా ప్రకటించలేదు. అయితే కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో చేసే పేమెంట్లపై పది శాతం వరకు డిస్కౌంట్, ప్లస్ మెంబర్స్‌కు 15 శాతం వరకు డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
అమెజాన్‌లో..
అమెజాన్ సైతం ఈ నెలలో అతిపెద్ద సేల్‌ను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌డే సేల్(Amazon prime day sale) 12న ప్రారంభమై 14న ముగియనుంది. అయితే ఈ సేల్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. సాధారణ వినియోగదారులు ఈ సేల్‌లో పాల్గొనాలంటే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సిందే. ప్రైమ్ డే సేల్‌లో అందించే ఆఫర్ల పూర్తి వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే పలు ఉత్పత్తులను ప్రత్యేకంగా లాంచ్(Launch) చేసి విక్రయిస్తుందని భావిస్తున్నారు. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు ఎస్‌బీఐ(SBI) క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది.