Hyderabad
Telangana government | తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారా.. తెలంగాణ సర్కారు నజర్​.. వేతనంలో కోతపై పరిశీలన

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | తమ చిన్న చిన్న సంతోషాలను త్యాగం చేసి.. తమ జీవితాలనే అర్పించి పెంచి, పెద్దచేసి, వారికో ప్రపంచం ఇచ్చిన తల్లిదండ్రులను (Parents) వారి జీవిత చరమాంకంలో నిర్లక్ష్యంగా వదిలేస్తున్న పిల్లలు ఎంతో మంది నేటి సమాజంలో ఉండడం దురదృష్టకరం.

తమ రక్త మాంసాలను పిల్లలకు ధార పోసి.. మలి వయసులో నిర్లక్ష్యానికి గురై అచేతనులైన తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణలోని రేవంత్​ రెడ్డి సర్కార్​ (Revanth Reddy government) యోచిస్తోంది. నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల కష్టాలను చూసిన సీఎం రేవంత్​రెడ్డి వారికి అండగా నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు.

Telangana government | వేతనాల నుంచి కోత..

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగస్తులైన పిల్లలపై సీఎం రేవంత్​ (CM Revanth Reddy) దృష్టి సారించారు. ఇలాంటి వారి జీతాల నుంచి 10–15% జీతాన్ని నేరుగా నుంచి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో (Bank account) జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగస్తుల పిల్లల సాలరీ నుంచి కోత పెట్టి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసే విధానాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఉద్యోగుల జీతాలలో 10–15% నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమ చేయవచ్చో లేదో పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై నివేదికను సమర్పించాలని అధికారులను కోరారు.

Telangana government | ట్రాన్స్‌జెండర్లపైనా..

హైదరాబాద్​లోని (Hyderabad) ట్రాన్స్‌జెండర్లపైనా (transgenders) సీఎం రేవంత్​ రెడ్డి దృష్టి సారించారు. వారికి ఉపాధి కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారిని ట్రాఫిక్ పోలీసు డిపార్ట్ మెంట్​లోకి (traffic police department) తీసుకున్నారు. దీంతోపాటు రవాణా, ఆరోగ్యం, ఎండోమెంట్స్, ఐటీ, ప్రైవేట్ కంపెనీలలో కూడా ట్రాన్స్‌జెండర్లను విస్తృతంగా చేర్చాలని అధికారులకు సీఎం సూచించారు.