Jabalpur district
Jabalpur district | భార్య చేతిలో మ‌రో భ‌ర్త బ‌లి.. పెళ్లి పేరిట వ‌ల వేసి మ‌రీ చంపేసిందిగా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jabalpur district | ఇలాంటి వార్త‌లు చ‌దువుతుంటే పెళ్లంటే భ‌య‌మేస్తుంది. ఒక వేళ పెళ్లి చేసుకున్నా ఆమెతో సంసారం చేయాల‌న్నా కూడా ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ కొంద‌రిలో క‌లుగుతుంది. తాజాగా భార్య (Wife) చేతిలో మ‌రో అమాయ‌కుడు బ‌లి అయ్యాడు. పెళ్లి కావడం లేదన్న ఆవేదనతో ఒక ఆధ్యాత్మిక వేదికపై మనసులోని బాధను పంచుకున్నాడు జబల్‌పూర్‌కు చెందిన రైతు ఇంద్రకుమార్ తివారీ (45). సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయిన ఆ వీడియో అతని ప్రాణాల మీదికి తెచ్చింది. ఓ కిలేడి నకిలీ పేరుతో అతడిని నమ్మించి నకిలీ పెళ్లి చేసుకుని అతడిని హతమార్చి ఆస్తి కొట్టేయాలని స్కెచ్ వేసింది. ఇప్పుడీ హత్య కేసు వెనుక ఉన్న అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది.

Jabalpur district | ప‌క్కా స్కెచ్‌తో..

ఇంద్రకుమార్, జబల్‌పూర్ జిల్లాలోని (Jabalpur district) పడ్వార్ గ్రామానికి (Padwar village) చెందిన ఉపాధ్యాయుడు. తన 18 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఇతడు, పెళ్లి కావడం లేదని తీవ్రంగా నిరాశచెందాడు. గత నెలలో అనిరుద్ధాచార్య మహారాజ్ (Aniruddhacharya Maharaj) నిర్వహించిన సత్సంగ్‌లో పాల్గొన్న ఆయన 18 ఎకరాల భూమి ఉన్నా… పెళ్లి కావడం లేదు అని వాపోయాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, అతని జీవితం ఇంత దారుణంగా ముగుస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

అయితే తివారీ వీడియోను చూసిన సాహిబా బాను అనీ కిలేడీ ‘ఖుషీ తివారీ’ (Khushi Tiwari) అనే నకిలీ పేరు సృష్టించి ఇంద్రకుమార్‌ను (Indra kumar tiwari) సోషల్ మీడియా ద్వారా వ‌ల‌లో వేసుకుంది. తాను కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అనాథనంటూ మాయ‌మాట‌లు చెప్పి, అతడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆమె మాయమాటలను పూర్తిగా నమ్మిన తివారీ, పెళ్లి కోసం కుషీనగర్ వెళ్తున్నట్లు గ్రామస్తులకు చెప్పి ప‌య‌న‌మ‌య్యాడు.

అయితే వివాహం జ‌ర‌గ‌బోతుంద‌న్న ఆశ‌తో ఒక ఎకరం భూమిని అమ్మి బంగారు ఆభరణాలు (gold ornaments) తయారు చేయించుకొని గోరఖ్‌పూర్‌కు చేరుకున్నాడు ఇంద్రకుమార్. ‘ఖుషీ’తో ప్రైవేట్‌గా వివాహం చేసుకున్నాడు. ఆనందంగా ఫొటోలు తీసుకున్నాడు. అయితే ఇంద్రకుమార్ వెంట తెచ్చుకున్న బంగారం, నగదును నొక్కేయాల‌ని ప్లాన్ చేసిన ఖుషి గ్యాంగ్ జూన్ 6న, కుషీనగర్‌లోని సుకరౌలీ ప్రాంతంలో జాతీయ రహదారి-28 (National Highway-28) పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లి, అతని మెడపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.

అనంతరం అతని వద్ద ఉన్న నగదు, నగలతో పరారయ్యారు. అయితే ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రిపించిన పోలీసులు (Police) ఇంద్రకుమార్ తివారీ కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్లను విశ్లేషించగా, ‘ఖుషీ తివారీ’ అనే పేరుతో ఉన్న‌ ఓ మహిళ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కనుగొన్నారు. లోతుగా దర్యాప్తు చేయగా, ‘ఖుషీ తివారీ’ (Kushi Tiwari) అనేది నకిలీ పేరని, అసలు నిందితురాలు కుషీనగర్‌కు చెందిన సాహిబా బాను అని తేలింది. దాంతో ప్రధాన నిందితురాలైన సాహిబా బానును అరెస్ట్ చేశాం. ఆమెను విచారించగా నేరాన్ని అంగీకరించింది. ఈ హత్యలో ప్రమేయమున్న ఆమె సహచరుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటాం అని ఎస్పీ సంతోష్ కుమార్ మీడియాకు తెలిపారు.