Nizamabad
Nizamabad | ఉద్యోగ విరమణ సహజం

అక్షర టుడే, ఇందూరు: Nizamabad | ప్రతి ఉద్యోగికి జీవితంలో పదవీ విరమణ సహజమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని బర్కత్​పురా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (Barkatpura School HM), పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ (Kripal Singh) సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో, పలువురు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు.

Nizamabad | విద్యారంగ సమస్యలపై పోరాటం

ప్రధాన ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తూనే కృపాల్​ సింగ్​ విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. పీఆర్టీయూ తెలంగాణ (PRTU Telangana) అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థులను తీర్చిదిద్దుతూనే.. వారికి కావాల్సిన సౌకర్యాలపై పోరాడారు. అంతేగాకుండా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల కోసం ఆయన తమ సంఘం తరఫున ఆందోళనల్లో పాల్గొన్నారు.