- Advertisement -
Homeబిజినెస్​Interest Rates | చిన్న మొత్తాల పొదుపు రేట్లు ఖరారు

Interest Rates | చిన్న మొత్తాల పొదుపు రేట్లు ఖరారు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Interest Rates | పోస్ట్​ ఆఫీస్ (Post Office)​ పొదుపు పథకాల్లో ఎంతో మంది తమ డబ్బులను దాచుకుంటారు. చిన్న చిన్న మొత్తాలను మదుపు (Invest) చేస్తుంటారు. బయట పెట్టుబడులపై రిస్క్​ ఉండటంతో చాలా మంది మధ్య తరగతి వారు పోస్ట్​ ఆఫీసులో తమ డబ్బులను మదుపు చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం పోస్ట్​ ఆఫీస్​ సేవింగ్స్​ పథకాల వడ్డీ రేట్లపై మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. అవసరం అనుకుంటే వడ్డీ రేట్లను మారుస్తుంది. తాజాగా కేంద్రం జులై నుంచి సెప్టెంబర్​ (రెండో​ త్రైమాసికం) వరకు పొదుపు పథకాల వడ్డీ రేట్లను (Interest Rates) ఖరారు చేసింది. అయితే గతంతో పోలిస్తే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

Interest Rates | ఆరోసారి ఎలాంటి మార్పు లేదు

గత ఆరు త్రైమాసికాల నుంచి కేంద్రం పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చడం లేదు. జూన్ నుంచి సెప్టెంబర్ క్వార్టర్​కు సంబంధించి వడ్డీ రేట్లు గత త్రైమాసికానికి సంబంధించినవే కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్​ జారీ చేసింది.

Interest Rates | వడ్డీ రేట్ల వివరాలు.. (శాతాల్లో)

  • పోస్ట్​ ఆఫీస్​ సేవింగ్స్​ అకౌంట్​ : 4
  • ఏడాది ఫిక్స్​డ్​​ డిపాజిట్​ : 6.9
  • రెండేళ్ల డిపాజిట్​ : 7
  • మూడేళ్ల డిపాజిట్​ : 7.1
  • ఐదేళ్ల డిపాజిట్​ : 7.5
  • ఐదేళ్ల రికరింగ్​ డిపాజిట్​ : 6.7
  • సీనియర్​ సిటిజన్​ సేవింగ్స్​ స్కీం : 8.2
  • నేషనల్ సేవింగ్స్​ సర్టిఫికెట్ : 7.7
  • పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​ : 7.1
  • కిసాన్​ వికాస్​ పత్ర : 7.5
  • సుకన్య సమృద్ధి యోజన : 8.2
- Advertisement -
- Advertisement -
Must Read
Related News