అక్షరటుడే, వెబ్‌డెస్క్:IPS Anjaneyulu | ఏపీ నిఘా విభాగం మాజీ చీఫ్, ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీ(CID custody)కి అనుమతి ఇచ్చింది. సినీనటి కాదంబరి జెత్వాని(Kadambari Jethwani)పై అక్రమంగా కేసు పెట్టడంతో వేధించారని ఆంజనేయులు(Anjaneyulu)ను ఏపీ సీఐడీ పోలీసులు(AP CID Police) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయనకు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ సీఐడీ కోర్టులో అధికారులు పిటిషన్(Petition) వేశారు. ఈ మేరకు కోర్టు మూడు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. కాగా జెత్వానీ కేసు విషయంలో ఆయనను అధికారులు ప్రశ్నించనున్నారు.
