ePaper
More
    HomeతెలంగాణPashamylaram | రియాక్టర్​ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

    Pashamylaram | రియాక్టర్​ పేలుడు ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పఠాన్​చెరు మండలం పాశమైలారం రియాక్టర్​ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్ ఇండస్ట్రీ (Sigachi Chemical Industry)లో సోమ‌వారం ఉద‌యం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రియాక్టర్​ పేలడంతో కార్మికులు సజీవ దహనం అయ్యారు. పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా అందులో నలుగురు మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో పది మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    Pashamylaram | కొనసాగుతున్న ఆపరేషన్​

    రియాక్టర్​ పేలడం (Reactor Explosion)తో పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పేలుడు దాటికి కార్మికులు దూరంగా ఎగిరి పడ్డారు. అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ (Administration Building) కూలిపోయింది. మరో భవనానికి బీటలు వారాయి. అయితే కూలిన భవనం శిథిలాల కింద ముగ్గురు ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    Pashamylaram | వైస్​ ప్రెసిడెంట్​ మృతి

    సిగాచి ఫ్యాక్టరీ జరిగిన పేలుడులో కార్మికులతో పాటు కంపెనీ వైస్​ ప్రెసిడెంట్(Company Vice President)​ కూడా మృతి చెందారు. వైస్ ప్రెసిడెంట్​ ఎల్​ఎన్​ గోవన్​ ప్లాంట్​లోకి రాగానే పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతపై కమిటీ వేస్తామని మంత్రి వివేక్​ తెలిపారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...