అక్షరటుడే, వెబ్‌డెస్క్:Flipkart Summer Sale | మండే ఎండల్లో ఆఫర్లలో చిల్(Chill) చేయడానికి ఫ్లిప్‌కార్ట్ సిద్ధమయ్యింది. మే ఒకటో తేదీనుంచి సమ్మర్ సేల్(Summer sale) ప్రారంభించనున్నట్లు తన వెబ్సైట్లో ప్రకటించింది. ఈ సేల్ పలు ప్రత్యేకతలతో డబుల్ డిస్కౌంట్ ఆఫర్స్, జాక్‌పాట్ డీల్స్(Jackpot deals), బై వన్ గెట్ వన్, క్రేజీ కాంబో డీల్స్‌తో రాబోతోంది. ప్రధానంగా శాంసంగ్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్(SBI Credit card), ఈఎంఐలపై 10 నుంచి 15 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. ఫ్లిక్‌కార్ట్ యాక్సిస్(Axis) క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సిల్వర్, గోల్డ్ మెంబర్స్(Gold members)కు ఎర్లీ యాక్సిస్(Early access)తో అదనపు ప్రయోజనాలు అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ(Samsung Galaxy) ఫోన్లపై క్రేజీ కాంబో డీల్స్తోపాటు భారీ డిస్కౌంట్ అందించనుంది. గెలాక్సీ ఎస్24 ప్లస్, ఎస్24ఎఫ్ఈ, ఎఫ్16, ఏ16, ఏ56, ఏ 35 మోడల్ ఫోన్లు అతి తక్కువ ధరకు లభించే అవకాశాలున్నాయి. మొబైల్స్(Mobiles)తోపాటు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ గ్యాడ్జెట్లు, లార్జ్ అప్లయన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, ఫర్నిచర్ తదితర వస్తువులపైనా ఆఫర్లు అందించనుంది.
Flipkart Summer Sale | ‘ప్లస్’తో ప్రయోజనాలు..
- ఫ్లిప్‌కార్ట్(Flipkart) తన ప్లస్ గోల్డ్, సిల్వర్ మెంబర్స్‌కు ఎర్లీ యాక్సిస్ ప్రయోజనం కల్పిస్తుంది. స్పెషల్ డేస్(Special days)లో సాధారణ సేల్ ప్రారంభానికంటే 12 గంటల ముందే వీరికి సేల్ అందుబాటులో ఉంటుంది.
- ప్లస్ మెంబర్స్కోసం అదనపు డిస్కౌంట్ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది. ప్లస్ గోల్డ్ మెంబర్స్‌కు ఎస్బీఐ కార్డుపై 15 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. సిల్వర్ మెంబర్స్(Sliver members)కు 12 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇది ఆయా వస్తువులపై ఆఫర్ అందుబాటులో ఉన్నంతవరకే వర్తిస్తుంది.
- ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్(Super coins) వినియోగించుకుని ఎంపిక చేసిన వస్తువులపై 5 శాతం వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
- గడిచిన 12 నెలల్లో ఫ్లిప్‌కార్ట్‌లో కనీసం పది ఆర్డర్లు(Orders) పెట్టినవారు సిల్వర్ మెంబర్‌షిప్‌నకు అర్హులు. 20 ఆర్డర్లు పెట్టినవారికి గోల్డ్ మెంబర్షిప్ ఇస్తుంది.
Flipkart Summer Sale | మొదటి 30 నిమిషాలలో కొనేయాలి..
ఈ కామర్స్(E-commerce) కంపెనీలు స్పెషల్ డేస్‌లో తొలి అరగంటలో అద్భుతమైన ఆఫర్లను అందిస్తాయి. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగానే దాని గురించి సెర్చ్ చేయాలి. స్పెషల్ డేస్‌లో ధరను పోల్చి కొనుగోలు చేస్తే తక్కువ ధరకు ఆ వస్తువును సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
రిటర్న్ పాలసీ(Return policy)ని చదవాలి. ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీలు చాలా వస్తువులను ఓపెన్ బాక్స్(Open box) డెలివరీ ఇస్తున్నాయి. ఇలా ఇచ్చే వస్తువులను రిటర్న్ చేయడం చాలా కష్టం. అందుకే వస్తువులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. డెలివరీ బాయ్ ఉన్నప్పుడే ఆ వస్తువును ఓపికగా అన్ని విధాలా పరీక్షించాకే డెలివరీ తీసుకోవాలి.