అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ (Kanteshwar Bypass) వద్ద డీఎస్ విగ్రహావిష్కణ (DS statue) కార్యక్రమంలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. రూరల్ ఎస్సై ఆరిఫ్ (Rural SI Arif) తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం విగ్రహావిష్కణలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మెడలో నుంచి దుండగులు గోల్డ్ చైన్లను తస్కరించారు. ముగ్గురి వద్ద కలిపి సుమారు 5 తులాల వరకు బంగారు గొలుసులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Nizamabad City | డీఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దొంగల చేతివాటం.. ముగ్గురి బంగారు గొలుసుల అపహరణ
Published on
