ePaper
More
    HomeతెలంగాణTelangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాంచందర్​రావు నామినేషన్​

    Telangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాంచందర్​రావు నామినేషన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana BJP President | తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి భర్తీకి నోటిఫికేషన్​ (notification) వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేత రాంచందర్​రావును (Ramchandra Rao) అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్​ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లు వేశారు.

    Telangana BJP President | చాలా పెద్ద బాధ్యత అప్పగించారు

    నామినేషన్​ (nomination) దాఖలు ముందుకు రాంచందర్​ రావు మాట్లాడుతూ 40 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం (party high command) నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించిందని వ్యాఖ్యానించారు. నా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని.. అందరితో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతానన్నారు. బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్‌ (Congress) పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ గెలుపుకోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకోసం నేతలందరితో కలిసి పనిచేస్తానన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...