ePaper
More
    HomeFeaturesSamsung Galaxy M36 5G | శాంసంగ్‌ నుంచి సూపర్‌ ఫోన్‌ ఏకంగా ఆరేళ్లపాటు ఓఎస్‌...

    Samsung Galaxy M36 5G | శాంసంగ్‌ నుంచి సూపర్‌ ఫోన్‌ ఏకంగా ఆరేళ్లపాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Samsung Galaxy M36 5G | ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ అయిన శాంసంగ్‌(Samsung).. జూలై 12నుంచి ప్రారంభమయ్యే అమెజాన్‌ ప్రైమ్‌ డే(Amazon prime day) సేల్‌ కోసం ఎం సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సూపర్‌ ఫీచర్స్‌తో గెలాక్సీ ఎం 36(Galaxy M 36) పేరుతో తీసుకువచ్చిన ఈ మోడల్‌ ధర రూ. 21 వేలలోపే.. ఈ ఫోన్‌ వచ్చేనెల 12వ తేదీనుంచి అమెజాన్‌, శాంసంగ్‌ వెబ్‌సైల్‌లతోపాటు ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి.

    డిస్‌ప్లే:6.7 అంగుళాల Full HD + సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 హెచ్‌జడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌తో తీసుకువచ్చారు.

    కలర్స్:7.7 mm సన్నని బాడీ కలిగిన ఈ మోడల్‌.. వెల్వెట్‌ బ్లాక్‌, సెరీన్‌ గ్రీన్‌, ఆరెంజ్‌ హెజ్‌ కలర్లలో లభిస్తుంది.

    ప్రాసెసర్‌:ఎక్సినోస్‌ 1380(5nm) అక్టాకోర్‌ ప్రాసెసర్‌. లార్జ్‌ వాపర్‌ కూల్‌ చాంబర్‌ను కలిగి ఉంది.

    ఆపరేటింగ్‌ సిస్టమ్‌:ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌ యూఐ 7. ఆండ్రాయిడ్‌ OS ఆరు జనరేషన్‌ అప్‌గ్రేడ్‌లు, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

    కెమెరాలు:ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. OISతో 50 MP మెయిన్‌ కెమెరా, 8 MP అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 2 MP మాక్రో సెన్సార్‌ ఉన్నాయి. ముందువైపు సెల్ఫీల కోసం 13 MP కెమెరాను అమర్చారు. ముందు, వెనక కెమెరాలు రెండూ 4k వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి.

    బ్యాటరీ సామర్థ్యం:5000 mAh. 25w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. బాక్స్‌తోపాటు చార్జర్‌ అందించడం లేదు.

    అదనపు ఫీచర్లు:గూగుల్‌తో సర్కిల్‌ టు సెర్చ్‌, జెమినీ లైవ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

    వేరియంట్స్‌:6GB + 128GB వేరియంట్‌ ధర రూ. 16,499.
    8GB + 128GB వేరియంట్‌ ధర రూ. 17,999.
    8GB + 256GB వేరియంట్‌ ధర రూ. 20,999

    కార్డ్‌ ఆఫర్‌:అమెజాన్‌ ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసేవారిక 3 నుంచి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...