ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vizag Glass Bridge | విశాఖకు స‌రికొత్త ఆకర్షణ.. కైలాసగిరిలో భారతదేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి...

    Vizag Glass Bridge | విశాఖకు స‌రికొత్త ఆకర్షణ.. కైలాసగిరిలో భారతదేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vizag Glass Bridge | ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పర్యాటక రంగం అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలను పర్యాటలక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి ఏపీలో టూరిస్ట్ రంగాన్ని మ‌రింత అభివృద్ధి చేయాల‌నే సంక‌ల్పంతో ఉంది. ఏపీలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్(AP Best Tourist Spot) అంటే మ‌నంద‌రికీ గుర్తుకు వ‌చ్చేది విశాఖప‌ట్నం. అక్క‌డి అందాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో క‌ట్టిప‌డేస్తుంటాయి. సింహాచలం దేవస్థానం(Simhachalam Temple), బీచ్‌లు, కైలాసగిరి(Kailasagiri) ఇలా ఎన్నో అందాలు విశాఖ సిగ‌లో మ‌ణిహారంగా చేరాయి. ఇప్పుడు విశాఖపట్నం నగరానికి మరో ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం(Glass Bridge Construction) శ‌ర‌వేగంగా సిద్ధ‌మ‌వుతుంది.

    Vizag Glass Bridge | జూలై నెలాఖరుకు అందుబాటులోకి..

    భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెన విశాఖ కైలాసగిరి(Visakhapatnam Kailasagiri) వద్ద నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే దాదాపు నిర్మాణం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ గాజు వంతెన పొడవు 50 మీటర్లు కాగా, ఈ వంతెన‌ని టైటానిక్ వ్యూపాయింట్‌(Titanic Viewpoint)కు సమీపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కైవాక్ ద్వారా సందర్శకులు సముద్రపు అలలు, ప్రకృతిలోని అందమైన దృశ్యాలను ఆకాశం నుంచి ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రేమికులు, అడ్వెంచర్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న ఈ వంతెన, పర్యాటకులకు ఒక కొత్త అనుభూతిని అందించనుంది. గాజుపై నడుస్తూ కింద క‌నిపించే ప్రకృతి దృశ్యాలను చూడడం ఒక థ్రిల్లింగ్ అనుభవంగా మారనుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో తేలియాడే మొద‌టి గ్లాస్ బ్రిడ్జిగా ఇది గుర్తింపు పొందనుంది. దీని పొడవు: 50 మీటర్లు కాగా, ఖర్చు: రూ. 6 కోట్లు వ‌ర‌కు అవుతుంది. ఒకేసారి 40 మంది వరకూ దీనిపై నిల్చునేలా ఈ గాజు వంతెన నిర్మించారు. స్కైవాక్‌తో పాటు, రెండు జిప్-లైన్‌లు, స్కై-సైక్లింగ్ ట్రాక్‌లు కూడా ఇక్క‌డ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక్కొక్కటి 150 మీటర్లు విస్తరించి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేరళలోని వాగమోన్ గ్లాస్ బ్రిడ్జి భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనగా పేరొంద‌గా, దీని పొడ‌వు 40 మీటర్లు. ఒకవేళ కైలాసగిరి స్కైవాక్ నిర్మాణం పూర్తి అయితే ఆ రికార్డును విశాఖపట్నం స్కైవాక్ బ్రేక్ చేస్తుంది. అంతేకాకుండా భారతదేశంలోనే పొడవైన గాజు వంతెనగా కైలాసగిరి గ్లాస్ స్కైవాక్(Kailasagiri Glass Skywalk) రికార్డులలోకి ఎక్కుతుంది. జూలై నెలాఖరులోగా సందర్శకులకు ఇది అందుబాటులోకి రానుంది.

    More like this

    Yellareddy | కొట్టుకుపోయిన రైతుల కష్టం.. మళ్లీ తెగిన చెరువు కట్ట

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | చెరువు కట్ట తెగిపోయిందని.. ఫీడర్​ కాల్వలు కొట్టుకుపోయాయని మరమ్మతులు చేయాలని రైతులు గగ్గోలు...

    Supreme Court | కంగ‌నా ర‌నౌత్‌కు షాక్‌.. ఎంపీ పిటిష‌న్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | బీజేపీ ఎంపీ, సినీ న‌టి కంగనా ర‌నౌత్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది....

    Ghati Movie | ఘాటీ పరాజయం తర్వాత సోషల్ మీడియా నుండి విరామం తీసుకున్న అనుష్క శెట్టి .. స్వీటీ భావోద్వేగ పోస్ట్ వైరల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghati Movie | ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి...