ePaper
More
    Homeజిల్లాలుఖమ్మంKhammam District | పురుగుల మందు తాగి కన్నుమూసిన ఖ‌మ్మం ఎస్సై భార్య‌.. వేధింపులే కార‌ణ‌మా?

    Khammam District | పురుగుల మందు తాగి కన్నుమూసిన ఖ‌మ్మం ఎస్సై భార్య‌.. వేధింపులే కార‌ణ‌మా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Khammam District | ఈ మధ్య ఆవేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు ప‌చ్చ‌ని జీవితాన్ని నాశ‌నం చేస్తున్నాయి. భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హజం. స‌మ‌స్య ఎంత పెద్ద‌దైన దానిని పెద్ద‌ల వ‌ర‌కు తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకోవాలే కాని చావుతో అన్నింటికి సొల్యూష‌న్ కాదు. తాజాగా ఖ‌మ్మం జిల్లా ర‌ఘునాథ పాలెం(Raghunatha Palem) జిల్లా మండ‌లంకి చెందిన ఖ‌మ్మం జీఆర్పీ ఎస్సై రాణా ప్ర‌తాప్(GRP SI Rana Pratap) భార్య రాజేశ్వ‌రి అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించ‌డం క‌ల‌కలం రేపుతుంది.నాలుగు రోజుల క్రితం జూలురుపాడులో ఆమె పురుగుల మందు తాగింది. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో వెంట‌నే హైద‌రాబాద్‌కి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ క‌న్ను మూసింది.

    రాజేశ్వ‌రి మృతిపై స్థానికులు, ఆమె త‌ల్లిదండ్రులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు గూర్చి అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. “అత్తింటివారే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని” ఆరోపిస్తున్నారు, ఎస్సై రాణా ప్ర‌తాప్, అత‌ని సోద‌రుడు ఎస్సై మ‌హేష్‌, త‌ల్లితో పాటు కుటుంబ స‌భ్యులు అంద‌రు కూడా రాజేశ్వ‌రిపై దాడి చేయ‌డం వ‌ల్ల‌నే ఆమె మృతి చెందిన‌ట్టుగా బంధువులు చెబుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణం జరిగిందని, ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.

    మృతురాలిని పోస్ట్ మార్ట్ కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రాజేశ్వ‌రి 8 సంవ‌త్స‌రాల క్రితం ఎస్ఐ రాణా ప్ర‌తాప్‌ని వివాహం చేసుకుంది. వారి వైవాహిక దాంప‌త్యంలో కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొద‌టి నుండి రాణా ప్ర‌తాప్ వ్య‌వ‌హారం కాస్త దురుసుగానే ఉండేద‌ని, వివాదాస్ప‌ద వ్య‌క్తిగా అత‌నికి పేరు ఉంద‌ని అంటున్నారు. ఖ‌మ్మం(Khammam)లో ట్రైనీ ఎస్సైగా ప‌ని చేస్తున్న స‌మయంలో గ‌న్ను పెట్టి బెదిరించే వాడ‌ని స్థానికులు చెబుతున్నారు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములకి సంబంధించిన గొడ‌వ పెద్దది కాగా, ఆ స‌మ‌యంలో స‌స్పెండ్ కూడా అయినట్టు స‌మాచారం.

    More like this

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....