- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Reservoir | నిజాంసాగర్ రిజర్వాయర్​లో చేపల వేట నిషేధం

Nizamsagar Reservoir | నిజాంసాగర్ రిజర్వాయర్​లో చేపల వేట నిషేధం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Reservoir | నిజాంసాగర్​ రిజర్వాయల్​లో జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేట నిషేధించినట్లు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి డోలి సింగ్ (Fisheries Development Officer Doli Singh) తెలిపారు. అచ్చంపేట (Achampet) మత్స్యశాఖ చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Nizamsagar Reservoir | రెండుల నెలల పాటు నిషేధం

జూలై, ఆగస్టు నెలలో వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం అధికమై జలాశయంలోకి చేరుతుందన్నారు. ఈ సమయంలో చేపల సంఖ్య వృద్ధి చెందుతుందన్నారు. జలాశయంలో చేపల ఉత్పత్తి (fish production) పెరగడం వలన చేపల వేటపై ఆధారపడే మత్స్య కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. కావున రెండు నెలలపాటు చేప పిల్లల వేట నిషేధిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల పాటు చేపల వేటకు వెళ్లకపోతే మిగతా పది నెలల పాటు మత్స్య కార్మికులకు విరివిగా చేపలు లభ్యమవుతాయని చెప్పారు.

- Advertisement -

కావున జూలై, ఆగస్టు నెలలో మత్స్య కార్మికులు చేపలు, రొయ్యలు పట్టవద్దని సూచించారు. మత్స్యశాఖ (Fisheries Department) ఆదేశాలను పట్టించుకోకుండా చేపల వేట కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై పోలీసులకు సైతం సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News