అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy railway station | ఆర్నెళ్లలోనే కామారెడ్డి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ zaheerabad MP Suresh Shetkar అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో government advisor Shabbir Ali కలిసి రైల్వేస్టేషన్‌ను railway station పరిశీలించారు.
రైల్వే డివిజనల్ ఇంజినీర్ Railway Divisional Engineer శశాంక్‌తో సమావేశమై మంజూరైన నిధులు, సమస్యలపై చర్చించారు. అనంతరం రైల్వేస్టేషన్లో ‘అమృత్ భారత్ పథకం’ ‘Amrit Bharat Scheme’ కింద కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ప్రయాణికులతో passengers మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. అమృత్ భారత్ స్కీం Amrit Bharat Scheme కింద పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కొత్తగా రెండు ఆర్వోబీల new ROBs కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, పాత రైల్వే గేటు వద్ద old railway gate ఆర్వోబీ నిర్మాణం కోసం సర్వే జరుగుతుందని, మట్టి పరీక్షలకు పంపించామని తెలిపారు. ఆర్వోబీలతో పాటు పాదాచారులు, ద్విచక్ర వాహనదారుల two-wheelers కోసం అండర్ గ్రౌండ్ బ్రిడ్జికి underground bridge ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.
మున్సిపల్ municipal, రైల్వే శాఖల railway departments సమన్వయంతో పనులు చేపడతామని తెలిపారు. పాత రాజంపేట వద్ద ఆర్వోబీ కోసం నేషనల్ హైవే అథారిటీ National Highway Authority వారికి ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో railway station తాగునీరు, టాయిలెట్స్ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్కలేటర్ నిర్మాణం కూడా ఆర్నెళ్లలో పూర్తవుతుందని పేర్కొన్నారు.