ePaper
More
    Homeజాతీయం90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    90 Degrees Bridge | 90 డిగ్రీస్​లో వంతెన నిర్మాణం.. ఎంత మంది సస్పెండ్‌ అయ్యారంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: 90 Degrees Bridge : మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన (railway bridge) తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వారధిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడమే ఇందుకు కారణం. L ఆకారంలో నిర్మించిన ఈ బ్రిడ్జి(L shape bridge)ని ఇంకా ప్రారంభించలేదు. అయితే ప్రారంభానికి ముందే దీని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో(social media) వైరల్‌(viral) అయ్యాయి. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో అధికారులు వంతెన ప్రారంభోత్సవాన్ని ఆపేశారు.

    90 Degrees Bridge : ఏకంగా ఏడుగురిపై వేటు..

    వంతెన నిర్మాణ స్టైల్​ సర్కారు దృష్టికి వెళ్లడంతో స్థానిక ప్రజాప్రతిధులతోపాటు, అధికారులపై ప్రభుత్వం మండిపడింది. దీని నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఏకంగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్‌ చేసింది. దీని నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌పైనా శాఖాపరమైన చర్యలకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

    90 Degrees Bridge : సీఎం మోహన్​ యాదవ్​ ఏమన్నారంటే..

    బ్రిడ్జి వ్యవహారంపై Madhya Pradesh సీఎం మోహన్ యాదవ్‌ CM Mohan Yadav స్వయంగా స్పందించారు. వంతెన నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారధి నిర్మాణంపైనా విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీనికితోడు వంతెన నిర్మాణ ఏజెన్సీ, దాని డిజైన్‌ రూపొందించిన కన్సల్టెంట్​ను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు చెప్పారు. ఈ వారధిని పునరుద్ధరించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...