ePaper
More
    HomeజాతీయంBengaluru | మహిళ మృతదేహం కాళ్లను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    Bengaluru | మహిళ మృతదేహం కాళ్లను మెడకు కట్టి.. చెత్త లారీలో పడేసి.. బెంగళూరులో దారుణం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bengaluru : బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని పడేశారు. అదీనూ ఆ మృతదేహం కాళ్లను మెడకు కట్టేసి చెత్తలారీలో పడేయడం గమనార్హం. చన్నమ్మనకెరె స్కేటింగ్ గ్రౌండ్ Channammanakere skating ground సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది.

    Bengaluru : దారుణంగా కట్టేసి..

    పారిశుద్ధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హత్య కేసుపై దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కాళ్లు ఆమె మెడకు కట్టి, శరీరాన్ని గోనెలో చుట్టి ఉంచారని పోలీసులు తెలిపారు. మృతురాలి వయసు 25 నుంచి 35 మధ్య వయసు ఉంటుందని తెలుస్తోంది.

    మొదట ఆ అసాధారణంగా బరువు బ్యాగును గమనించిన స్థానికుడు BBMP సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. మహిళ వేరే చోట చంపబడి ఉండవచ్చని జాయింట్ కమిషనర్ సీవీ వంశీకృష్ణ తెలిపారు. ఆ బ్యాగును తెల్లవారుజామున 1 నుంచి 3 గంటల సమయంలో చెత్త వాహనంలో పడేసినట్లు తెలుస్తోందన్నారు.

    Bengaluru : అత్యాచారం జరిగిందా..

    CCTV ఫుటేజీలో అర్ధరాత్రి తర్వాత ఆటోరిక్షాలో వచ్చిన కొందరు మహిళ మృతదేహం ఉన్న బ్యాగును వదిలివెళ్లడాన్ని గుర్తించారు. మృతదేహంపై లోదుస్తులు లేకపోవడంతో అత్యాచారానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతదేహంపై టీ-షర్ట్, ప్యాంటు ధరించి ఉంది. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాకే మరణానికి గల కారణాన్ని నిర్ధారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చెన్నమ్మనకెరె అచుకట్టు పోలీస్ స్టేషన్‌లో దీనికి సంబంధించిన కేసు నమోదు అయింది.

    Latest articles

    Today Gold Price | అంత‌కంత పెరుగుతున్న బంగారం ధ‌ర‌.. నేడు ఎంతంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప్రతి రోజూ బంగారం, వెండి Silver ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుండ‌టం...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చిత(Uncertainty) పరిస్థితులతో గ్లోబల్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌్‌గా ఉన్నాయి....

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 6 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kartavya Bhavan | నేడు కర్తవ్య భవన్​ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Kartavya Bhavan : సెంట్రల్ విస్టా (Central Vista) కింద మొదటి కామన్ సెక్రటేరియట్ (first...

    More like this