Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం
Srisailam | శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కలకలం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srisailam : జ్యోతిర్లింగాల్లో(Jyotirlingas) ఒక్కటైన శ్రీశైలం లడ్డూ ప్రసాదం (Laddu Prasad)లో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana’s capital Hyderabad)​కు సమీపంలో ఉన్న ఈ పుణ్య క్షేత్రానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆ సర్వేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు.

Srisailam : విషయం బయటకు రాకుండా..

కాగా, ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించింది. నిర్ఘాంతపోయిన భక్తుడు గుడి సిబ్బందిని ప్రశ్నించారు. కాగా, విషయం తెలిసి భక్తుడి నుంచి అధికారులు లడ్డూను లాగేసుకున్నారు. వీడియో తీసిన వారిపై సైతం ఒత్తిడి చేశారు.

Srisailam : భక్తులు ఆందోళనకు దిగడంతో..

సామరస్యంగా మాట్లాడుకుందామని అధికారులు సముదాయించే ప్రయత్నం చేశారు. బొద్దింక విషయం బయటకు రాకుండా చూశారు. కానీ, భక్తులు ఆందోళనకు దిగడంతో విషయం వెలుగుచూసింది. స్వామివారి పవిత్రమైన లడ్డూలో బొద్దింక రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.