ePaper
More
    HomeతెలంగాణMP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    MP Raghunandan Rao | మరికాసేపట్లో చంపేస్తాం.. ఎంపీ రఘునందన్​రావుకు మరోసారి బెదిరింపులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Raghunandan Rao | బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ఆపరేషన్​ కగార్​ (Operation kagar) ఆపేయాలని, లేకపోతే మరికాసేపట్లో చంపేస్తామని ఓ అగంతకుడు ఎంపీకి ఫోన్​ చేశాడు. తమ బృందాలు హైదరాబాద్‌లో (Hyderabad) ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సదరు వ్యక్తి సవాల్​ విసిరడం గమనార్హం.

    రెండు రోజుల క్రితం సైతం ఆయనకు బెదిరింపు ఫోన్​ కాల్​ వచ్చింది. జూన్​ 23న తొలిసారి ఫోన్​ చేసిన దుండగులు చంపేస్తామని బెదిరించారు. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) ఆపాలని సదరు వ్యక్తి డిమాండ్​ చేశాడు. తాను మధ్యప్రదేశ్​కు (Madhya Pradesh) చెందిన మావోయిస్ట్​గా అగంతకుడు చెప్పడం గమనార్హం. కాగా రెండు నంబర్ల నుంచి రఘునందన్​ రావుకు బెదిరింపు కాల్స్​ వస్తున్నాయి.

    MP Raghunandan Rao | భద్రత పెంపు

    ఎంపీ రఘునందన్ ​రావుకు (MP Raghunandan Rao) జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఆయన డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టి ఆయనకు భద్రత పెంచాలని నిర్ణయించారు. ఎంపీ పర్యటనలో ఎస్కార్ట్​ ఏర్పాటు చేయాలని పోలీస్​ శాఖ నిర్ణయించింది. ఏ మేరకు డీజీపీ నుంచి మెదక్​ పార్లమెంట్​ నియోజకవర్గంలోని సిద్దిపేట సీపీ, మెదక్​, సంగారెడ్డి ఎస్పీలకు ఆదేశాలు అందాయి. అయితే మరోసారి ఆయనకు బెదిరింపు కాల్​ రావడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...