ePaper
More
    HomeసినిమాPawan Kalyan | పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదంటూ ప్ల‌కార్డులు.. 48 గంటల్లో...

    Pawan Kalyan | పవన్ అన్నా మా బిడ్డ కనిపించడం లేదంటూ ప్ల‌కార్డులు.. 48 గంటల్లో ఆచూకీని కనుగొన్న పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | సుమారు 18 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా (Kakinada district) కరప గ్రామానికి వచ్చి స్థిర‌ప‌డింది ఓ మార్వాడి కుటుంబం. వ్యాపారం చేసుకుంటూ అక్క‌డే స్థిర‌ప‌డ‌గా, జూన్ 8వ తారీఖున తమ పద్నాలుగేళ్ల కుమార్తె కనిపించకుండా (Daughter Missing) పోయింది. దీంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు (Police complain) చేశారు. అయినా పోలీసులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో నిరాశ‌లో మునిగిపోయారు. అయితే పోలీసుల తీరుతో విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు, తమ కుమార్తెను కాపాడమంటూ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pawan Kalyan) సహాయం కోరారు. ఆయనను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కాకినాడకు వస్తున్నారని తెలుసుకుని తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.

    పవన్​ కల్యాణ్​ కాకినాడ సభకు (Kakinada meeting) హాజరయ్యే రోజు వారు ప్లకార్డులు ప‌ట్టుకొని వ‌చ్చారు. “పవన్ అన్నా, మా బిడ్డ కనిపించడం లేదు… 20 రోజులైనా సమాచారం లేదు… న్యాయం చేయండి” అంటూ విలపించారు. మొదట విమానాశ్రయం (airport) వద్ద, తర్వాత సభా ప్రాంగణంలోనూ ప్లకార్డులతో పవన్ దృష్టిని ఆకర్షించారు. ఈ సమస్య పవన్​ కల్యాణ్​ దృష్టికి చేరిన 48 గంటల్లోనే పోలీసులు (Police) పటిష్టంగా వ్యవహరించారు. చివరకు బాలిక ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

    తమ బిడ్డ కనిపించకుండా పోయినప్పటి నుంచి.. తమ పక్కింట్లో ఉండే 23 ఏళ్ల యువకుడు కూడా కనిపించక‌పోవ‌డంతో అత‌డిపైనే అనుమానంగా ఉంద‌ని పోలీసుల‌కు తెలిపారు. ఎన్నిసార్లు విన్న‌వించుకున్నా పోలీసులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని.. కనీసం డిప్యూటీ సీఎంను (Pawan Kalyan) కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు తమను అడ్డుకున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద‌ చర్చనీయాంశంగా కూడా మారింది. చివరకు వారి సమస్య డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ వరకు వెళ్లడంతే.. 48 గంటల్లోనే వారి బిడ్డ ఆచూకీని పోలీసులు గుర్తించారు. దీంతో కుటుంబం సంతోషం వ్య‌క్తం చేసింది.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....