- Advertisement -
HomeతెలంగాణElevated corridor | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. ఎలివేటెడ్​ కారిడార్ల​ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

Elevated corridor | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. ఎలివేటెడ్​ కారిడార్ల​ నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Elevated corridor | హైదరాబాద్ (Hyderabad)​ నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. దీంతోపాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. వాహనాల రద్దీ పెరగడంతో నగరవాసులు ట్రాఫిక్​ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం ప్రభుత్వం నగరంలో ట్రాఫిక్​ సమస్య (Traffic Problem) పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం పీజేఆర్​ ఫ్లై ఓవర్ (PJR Flyover)​ను సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్​ పరిధిలో ట్రాఫిక్​ తిప్పలు తప్పించడానికి ప్రభుత్వం తాజాగా కీలక ఒప్పందం చేసుకుంది.

Elevated corridor | రక్షణ శాఖతో ఒప్పందం

సికింద్రాబాద్​ (Secunderabad) నగరంలో ట్రాఫిక్​ సమస్య అధికంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ శాతం రోడ్లు కంటోన్మెంట్​ బోర్డు పరిధిలో ఉంటాయి. దీంతో వాటి విస్తరణకు ఆటంకాలు ఉండడంతో ట్రాఫిక్​ సమస్య అలాగే ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం సికింద్రాబాద్​లో ఎలివేటెడ్​ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. రక్షణ శాఖ పరిధిలో ఉంటే కంటోన్మెంట్ (Cantonment)​ భూముల మీదుగా ఈ కారిడార్​ నిర్మించనున్నారు. ఈ క్రమంలో తాజాగా కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

- Advertisement -

Elevated corridor | రెండు కారిడార్లు..

ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్​కు వచ్చే వాహనదారులు ప్రస్తుతం సికింద్రాబాద్​ మార్గంలో ట్రాఫిక్​ సమస్యతో తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో ఆయా జిల్లాలకు కనెక్టివిటీ పెంచేలా రెండు కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యారడైజ్ సర్కిల్ నుంచి శామీర్‌పేట (SH-01) వరకు 18.14 కిలోమీటర్లు, ప్యారడైజ్​ సర్కిల్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు కారిడార్ (NH-44) వరకు 5.32 కిలో మీటర్ల మేర ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మించనున్నారు.

Elevated corridor | గతంలోనే అనుమతి

ఎలివేటెడ్​ కారిడార్ల నిర్మాణానికి గతంలోనే రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా భూముల బదలాయింపునకు సంబంధించి ఒప్పందం(MoU) కుదిరింది. కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖ దాదాపు 65 ఎకరాల భూమిని హెచ్​ఎండీఏకు ఇవ్వనుంది. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు 435 ఎకరాల భూమిని ఇవ్వనుంది.

Elevated corridor | కారిడార్​ నిర్మాణం ఈ మార్గంలో..

సికింద్రాబాద్​లోని జింఖానా మైదానం నుంచి హకీంపేట ఎయిర్​పోర్ట్ ​స్టేషన్, శామీర్​పేట మీదుగా ఔటర్​ రింగ్​రోడ్డు వరకు కారిడార్​ నిర్మిస్తారు. ప్యారడైజ్ సర్కిల్​ నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్ ​రోడ్డు వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ ​కారిడార్​ నిర్మిస్తారు. ఎయిర్​పోర్టు ఆనుకొని ఉన్న ప్రాంతంతో సొరంగ మార్గంలో కారిడార్​ నిర్మిస్తారు. దీనికి మొత్తం రూ.3,812 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ కారిడార్ల కోసం పలు ప్రైవేట్​ ఆస్తులను కూడా అధికారులు సేకరించనున్నారు. పలు భవనాలు కూల్చి వేయడానికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం రక్షణ శాఖతో ఒప్పందం కుదరడంతో త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News