అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Karreguttalu | తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులో ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాల security forces కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. ఈ అడవుల్లో భారీగా మావోయిస్టులు moists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ వైపు జరిగిన ఎన్కౌంటర్లో 30మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా బలగాలు మావోయిస్టుల భారీ బంకర్ bunkerను గుర్తించాయి. వెయ్యి మంది ఉండేలా భారీ గుహను గుర్తించారు. భద్రతా బలగాల రాకను పసిగట్టి ముందే మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కర్రెగుట్లల్లో అనేక గుహలు ఉండడంతో బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి.