ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Kethireddy Pedda Reddy | తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    Kethireddy Pedda Reddy | తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kethireddy Pedda Reddy | అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని (Kethireddy Pedda Reddy) పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏడాది తర్వాత ఆయన తన ఇంటికి రాగా.. తమ అనుమతి లేకుండా వచ్చారని పోలీసులు అరెస్ట్​ (Police Arrested) చేసి అదుపులోకి తీసుకున్నారు.

    Kethireddy Pedda Reddy | అల్లర్లతో అనుమతి నిరాకరాణ

    ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP assembly elections) అనంతరం తాడిపత్రిలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన ఏడాదిగా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లలేదు. అయితే తనను పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన హైకోర్టును (High Court) ఆశ్రయించారు. దీంతో తాడిపత్రి వెళ్లడానికి ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు కోర్టు ఆదేశాలు (Court Orders) పాటించడం లేదంటూ ఇటీవల ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సడెన్​గా ఆయన తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లారు.

    Kethireddy Pedda Reddy | అనంతపురం తరలింపు

    తాడిపత్రిలోని (Tadipatri) తన ఇంట్లో ఉన్న పెద్దారెడ్డి పోలీసులు అరెస్ట్​ చేశారు. తన ఇంట్లో తాను ఉంటే తప్పేంటని పెద్దారెడ్డి వారితో వాగ్వాదం చేశారు. అయినా బలవంతంగా అదుపులోకి తీసుకొని మాజీ ఎమ్మెల్యేను అనంతపురం (Anantapur) తరలించారు. అల్లర్లు జరుగుతాయనే ముందస్తు జాగ్రత్తలతో పెద్దారెడ్డిని పట్టణం నుంచి తీసుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    Latest articles

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    More like this