- Advertisement -
HomeతెలంగాణRain Alert | రైతులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి భారీ వర్షాలు

Rain Alert | రైతులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి భారీ వర్షాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Alert | వాతావరణ శాఖ అధికారుల రైతుల (Farmers)కు చల్లని కబురు చెప్పారు. గత మూడు రోజులుగా వర్షాలు (Rains) లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు సాగు పనులు ప్రారంభించారు. కొందరు వరినాట్లు కూడా వేశారు. తీరా మూడు రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.

Rain Alert | అల్పపీడన ప్రభావంతో..

బంగాళాఖాతం (Bay of Bengal) లో అల్ప పీడనం (LPA) ఏర్పడింది. దీని ప్రభావంతో నేటి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్​ ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ఆదివారం వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్​నగర్, నారాయణపేట, సిద్దిపేట, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రిపూట వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్​ ఉంది. మధ్యాహ్నం, సాయంత్రం పూట నగరంలో వాన పడొచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రానున్న మూడు, నాలుగు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా అల్ప పీడన ప్రభావంతో వర్షాలు పడుతాయని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News