ePaper
More
    Homeజిల్లాలుఆదిలాబాద్Travel bus | ట్రావెల్​ బస్సు బోల్తా.. 25 మంది ప్రయాణికులకు పైగా గాయాలు

    Travel bus | ట్రావెల్​ బస్సు బోల్తా.. 25 మంది ప్రయాణికులకు పైగా గాయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Travel bus : తెలంగాణ(Telangana)లోని ఆదిలాబాద్ జిల్లా(Adilabad district)లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు (orange travel bus) అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆదిలాబాద్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుడిహత్నూర్(Gudihatnur) దగ్గరలో ట్రావెల్​ బస్సు అదుపుతప్పింది. హైదరాబాద్(Hyderabad) నుంచి మహారాష్ట్ర(Maharashtra)లోని అమరావతి(Amaravati)కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    Travel bus : స్థానికుల సహాయ సహకారాలు..

    శనివారం(జూన్​ 29) రాత్రే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికులు గమనించి ప్రయాణకులకు సహాయ సహకారాలు అందించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు అదుపు తప్పడం వల్లే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

    Travel bus : ప్రమాద సమయంలో..

    బస్సు ప్రమాదం జరిగిన సమయంలో అందులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. రాత్రి సమయంలో గుడిహత్నూర్ వద్ద ఉన్న మలుపు రహదారిలో ట్రావెల్​ బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు.

    Travel bus : నిశీరాత్రి వేళ..

    రాత్రి వేళ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చుట్టూ చిమ్మ చీకటి.. బోల్తా పడిన బస్సు.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. స్థానికులు అక్కడికి చేరుకునే వరకు ప్రయాణికులు భయంతో బిక్కుబిక్కుంటూ గడిపారు.

    More like this

    Encounter | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | జమ్మూ కశ్మీర్​లో సోమవారం తెల్లవారుజామున ఎన్​ కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ...

    US Open Final | యూఎస్ ఓపెన్ ఫైన‌ల్‌లో స‌త్తా చాటిన అల్క‌రాజ్.. తిరిగి నంబ‌ర్ 1 ర్యాంక్ సొంతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Open Final | యూఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్‌కు...

    Apprentice | ఐవోసీలో అప్రెంటిస్‌ పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apprentice | దేశవ్యాప్తంగా పలు అప్రెంటిస్‌(Apprentice) పోస్టుల భర్తీ కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(Indian...