ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Diesel vehicles | డీజిల్‌ వాహనాలను నగరం బయటకు పంపిస్తాం: సీఎం రేవంత్​రెడ్డి

    Diesel vehicles | డీజిల్‌ వాహనాలను నగరం బయటకు పంపిస్తాం: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Diesel vehicles | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో కాలుష్యం తగ్గించడానికి చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.

    శనివారం ఆయన పీజేఆర్​ ఫ్లై ఓవర్ (PJR Flyover)​ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్​లో నగరంలో జనాభా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాలుష్యం పెరిగితే భవిష్యత్​ తరాలు నగరంలో జీవించలేవని.. అందుకే కాలుష్య నివారణ కోసం చర్యలు చేపడుతామన్నారు. ఇందులో భాగంగా డీజిల్​ వాహనాల (Diesel vehicles)ను నగరానికి అవతలకు పంపించే చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.

    Diesel vehicles | గుణపాఠం నేర్చుకోవాలి

    ప్రస్తుతం కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నివసించలేని పరస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అలాగే వర్షం వస్తే చెన్నై నగరం నీట మునుగుతుందన్నారు. బెంగళూరువాసులు ట్రాఫిక్​ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని సీఎం సూచించారు.

    Diesel vehicles | ఎలక్ట్రిక్​ ఆటోలు కొనండి

    నగరంలోని డీజిల్ వాహనాలను తొలగిస్తామని సీఎం అన్నారు. నగరంలో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తామన్నారు. అలాగే ఆటో డ్రైవర్లు కూడా డీజిల్​ ఆటోలను తీసేసి ఎలక్ట్రిక్​ ఆటోలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున కూడా ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్​ ఆటోలు కొంటే సాయం చేయడానికి చర్యలు చేపడుతామన్నారు. అలాగే ట్యాక్సీలు, ఇతర వాహనదారులు కూడా డీజిల్​ బండ్లను తీసేయాలని ఆయన సూచించారు. ఎలక్ట్రిక్​ వాహనాలు (Electric vehicles) కొనేవారికి పన్ను రద్దు చేసినట్లు సీఎం గుర్తు చేశారు.

    Diesel vehicles | నాలాల కబ్జాతోనే ముంపు

    నగరంలోని నాలాలు కబ్జా అవడంతోనే వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని సీఎం తెలిపారు. దీంతో చెరువులు, నాలాల రక్షణకు హైడ్రా (Hydraa) ఏర్పాటు చేశామన్నారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చి వేసిందన్నారు. వరద నీళ్లు వెళ్లేందుకు చెరువుల్లేకుండా కొందరు కబ్జాలు చేశారని సీఎం పేర్కొన్నారు. బతుకమ్మకుంటను బీఆర్​ఎస్ నాయకులు (BRS Leaders) ఆక్రమించుకుంటే కబ్జా నుంచి విడిపించామని సీఎం తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...