ePaper
More
    Homeఅంతర్జాతీయంViral Video | పొడ‌వాటి పాముని మింగ‌డానికి ప్ర‌య‌త్నించిన బాలుడు.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Viral Video | పొడ‌వాటి పాముని మింగ‌డానికి ప్ర‌య‌త్నించిన బాలుడు.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral Video | ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో (Social media) తెగ‌ వైరల్‌గా మారింది. అది నెటిజన్లు ఉలిక్కిప‌డేలా కూడా చేసింది.

    ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు ‘విషపూరిత’ పామును (poisonous snake) మింగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లలను అలాంటి ప్రమాదకరమైన పాములకు దగ్గర‌కి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని పేర్కొన్నారు. ఈ వీడియో 13 సెకన్లు ఉండ‌గా, ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది.

    Viral Video | ఇదేం డేర్..

    వీడియోలో పసుపు రంగు టీ-షర్ట్ ధరించిన ఒక చిన్న పిల్లవాడు నేలపై కూర్చుని ఉండ‌గా, అత‌ని ముందు పెద్ద పాము (బహుశా కోబ్రా) (cobra) ఒక‌టి కనిపిస్తోంది. బాలుడు పామును నోటితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను ఒక్కసారిగా వంగి, పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండ‌గా, పాము ఈ దాడిని గ్రహించి వెంటనే వెనక్కి తప్పుకుంటుంది. ఈ పని బాలుడు (Boy) ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు చేయడం ఆశ్చర్యకరం. ప్రతిసారీ పాము (snake) భ‌య‌ప‌డి బాలుడిని తప్పించుకుని వెనక్కి వెళుతుంది. అయితే అదృష్ట‌వ‌శాత్తు పాము దాడి చేయకపోయినా, ఈ ఘటన గురించి నెటిజన్లు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ వీడియోను ‘జెజాక్ సి ఈడెన్ రియల్’ (Jezak C Eden Real) అనే ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేశారు. ఆయన క్యాప్షన్‌గా “పాము ప్రమాదంలో ఉంది” అని పేర్కొన్నాడు. అయితే, ఈ వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు విభిన్న రకాలైన కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది పిల్లల విష‌యంలో అజాగ్రత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా విష‌సర్పాలు (Poisonous Snakes) ఉన్న చోట వారిని క‌నిపెట్టుకుంటూ ఉండాల‌ని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో నెట్టింట ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...