ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ సీజన్‌లో ఎండ తక్కువగా ఉండడంతో డీ విటమిన్‌(Vitamin D) లభ్యత తగ్గుతుంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రత, పీడనం తగ్గడం వల్ల కీళ్లలోని సినోవియల్‌ ద్రవం(Synovial fluid) సాంద్రత మారుతుంది. ఇది కీళ్లలో పెళుసుదనాన్ని కల్పిస్తుంది. తక్కువ వాతావరణ పీడనంతో కీళ్ల(Joints) చుట్టూ ఉన్న కణజాలాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. ఈ నొప్పి నివారణకు యోగాలో ఉత్తమ మార్గాలు ఉన్నాయని యోగా గురువులు పేర్కొంటున్నారు. కొన్ని ఆసనాల(Asanas)తో కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చంటున్నారు. వర్షాకాలంలో వచ్చే కీళ్ల నొప్పులనుంచి ఉపశమనానికి వేయాల్సిన ఆసనాల గురించి తెలుసుకుందామా..

    వజ్రాసన(Vajrasana)

    1. నేలపై కూర్చోవాలి. కాళ్లు నేరుగా చాపి, పాదాలు దగ్గర దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. రెండు చేతులను పిరుదుల పక్కన నేలపై ఆనించాలి.
      కుడి కాలు(Right leg)ను వెనక్కి మడిచి, పాదాన్ని కుడి పిరుదుకింద ఉంచాలి. ఎడమ కాలును కూడా వెనక్కి మడిచి, పాదాన్ని ఎడమ పిరుదుకిందకు చేర్చాలి.
      మోకాళ్లు ఆనించాలి. వెన్నుముక(Spine) నిటారుగా ఉంచాలి. అరచేతులను తొడలపై ఉంచాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు కూర్చోవాలి.
      తర్వాత నెమ్మదిగా ఎడమ కాలును ముందుకు చాపాలి. ఆ తర్వాత కుడికాలును కూడా నేరుగా ముందుకు తీసుకువెళ్లాలి.

    Yoga Asanas | ప్రయోజనాలు..

    వజ్రం కఠినమైనది, విలువైనది. ఈ ఆసనం వేయడం ద్వారా మడమలలోనుంచి సాగే వజ్రనాడి శక్తిమంతమవుతుంది. శరీరం, మనసు వజ్రంలా దృఢంగా మారుతాయి. ఈ ఆసనం వేయడం వల్ల కాళ్లకు సంబంధించిన కీళ్లు, కండరాలు సడలించబడతాయి. పొట్ట కింది భాగానికి రక్తప్రసరణ మెరుగవుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటు అదుపులోకి వస్తుంది.
    సూచన : మెడనొప్పి సంబంధిత వ్యాధులు ఉన్నవారు గురువు సమక్షంలో సాధన చేయడం ఉత్తమం.

    తాడాసన(Tadasana)

    నిటారుగా నిలబడాలి. పాదాల(feet)ను కలిపి, చేతులను నమస్కార స్థితికి తీసుకురావాలి.
    శ్వాస పీలుస్తూ(Inhale) చేతులను నమస్కార స్థితిలోనే పైకి ఎత్తి శరీరాన్ని పైకి లాగాలి.
    పాదాలను పైకి లేపాలి. కాలి వేళ్లపై శరీర బరువును ఉంచాలి. ఈ స్థితిలో పది పదిహేను సెకన్ల పాటు ఉండాలి.
    ఆ తర్వాత శ్వాస వదులుతూ(Exhale) చేతులను అలాగే నమస్కార స్థితికి తీసుకు రావాలి. పాదాలను నేలకు తాకించాలి.

    Yoga Asanas | ప్రయోజనాలు:

    ఈ ఆసనంతో కండరాలు బలోపేతం అవుతాయి. శరీర సమతుల్యత పెరుగుతుంది. కీళ్ల అమరిక మెరుగుపడుతుంది. న్యూరోమస్కులర్‌ సమన్వయాన్ని ఈ ఆసనం ప్రేరేపిస్తుంది.

    సేతు బంధాసన(Setu Bandhasana)

    1. బోర్లా పడుకోవాలి. చేతులు తొడల పక్కన ఉంచాలి. అరచేతులు నేలకు తాకాలి.
      గాలి పీల్చుకుంటూ మోకాళ్లను వంచి, నడుము, వీపు భాగాలను పైకి లేపాలి. పాదాలను నేలపై సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో మోకాలునుంచి చీలమండ వరకు సరళ రేఖలో ఉండేలా చూసుకోవాలి. గడ్డం(Chin) ఛాతీని తాకాలి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి.
      శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము, వీపు భాగాలను నేలకు ఆనించాలి. కాళ్లను పూర్వ స్థితికి తీసుకువెళ్లాలి.
      మీ వీపుపై పడుకుని, మోకాళ్లను వంచి, పాదాలను తుంటి వెడల్పుతో వేరు చేయండి.

    Yoga Asanas | ప్రయోజనాలు:

    ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. హై బీపీ, అస్తమాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెడ, వీపు, కాళ్ల భాగాలను సాగదీస్తుంది. దిగువ వీపు, తుంటి, మోకాళ్లను బలోపేతం చేస్తుంది. వెన్నెముక కీళ్లు, సాక్రమ్‌కు రక్త ప్రవాహాన్ని(Blood circulation) పెంచుతుంది. సయాటికా నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసేవారికి ఇది మంచి రిలిఫ్‌ను ఇస్తుంది.

    సూచన :
    ఈ ఆసనాన్ని ఖాళీ కడుపుతో మాత్రమే వేయాలి. మెడనొప్పి, మైగ్రెయిన్‌ వంటి సమస్యలున్నవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

    More like this

    Kerala Government | కేరళ ప్ర‌భుత్వం వినూత్న పథకం.. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసాకు రూ. 20 వాపసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి...

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...