ePaper
More
    HomeతెలంగాణAmit Shah Tour | పసుపు రైతుల 30 ఏళ్ల కల నెరవేరింది: బీజేపీ రాష్ట్ర...

    Amit Shah Tour | పసుపు రైతుల 30 ఏళ్ల కల నెరవేరింది: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah Tour | పసుపు రైతుల 30 ఏళ్ల కల నెరవేరిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ పరిశీలకురాలు బంగారు శృతి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind)​ ఎంతో శ్రమించి పసుపు బోర్డు కార్యాలయాన్ని సాధించాడన్నారు. స్పైసిస్ బోర్డు (Spices board) నుంచి పసుపును వేరు చేసి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంలో ఎంపీ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు.

    Amit Shah Tour | ఢిల్లీ వెళ్లే అవసరం లేకుండా..

    దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణలో పసుపు పండుతుందని, రైతులకు ఢిల్లీ (Delhi) వరకు వెళ్లే శ్రమలేకుండా నిజామాబాద్​లో బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాబట్టి రైతులంతా హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(MLAs Dhanpal Suryanarayana), రాకేష్ రెడ్డి(Mla Rakesh reddy) మాట్లాడుతూ.. పసుపు బోర్డు తెలంగాణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పరిశ్రమల రాకతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంపీ అర్వింద్​ బోర్డు ఏర్పాటు చేస్తానని వాగ్దానం ఇచ్చిన తర్వాత, ప్రతిపక్షాలు అవహేళన చేశాయని అన్నారు. ప్రస్తుతం వారి కళ్లు చెదిరేలా ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

    Amit Shah Tour | మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా రాక

    పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రానున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తెలిపారు. కార్యాలయ ప్రారంభం, తర్వాత రైతులతో కాసేపు ముచ్చటించి, అక్కడి నుంచి బైపాస్ చౌరస్తాలో డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. తదనంతరం పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic grounds) ఏర్పాటు చేసిన రైతు సభకు హాజరై ప్రసంగిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan reddy), కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay), రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Rajya Sabha member Laxman), ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, హరీష్ బాబు, వెంకట రమణారెడ్డితో పాటు రాష్ట్ర జాతీయ నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...